Anand Mahindra: వాట్ ఏ స్టేడియం.. కళ్లు విప్పార్చి చూడాల్సిందే!

తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మరో కొత్త విషయంతో నెటిజన్లను పలకరించారు. ఈసారి ఆయన్ను ఆకట్టుకున్నది ఓ ఫుట్‌బాల్‌ స్టేడియం. దాని చిత్రాలను నెట్టింట్లో షేర్ చేశారు. 

Updated : 24 Apr 2023 16:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తరచూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తుంటారు. అలాగే దేశంలోని అద్భుతాలను ట్విటర్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా దేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్‌బాల్‌ స్టేడియం (India's Highest Football Stadium) ఫొటోలను పంచుకున్నారు. అలాగే అక్కడ మ్యాచ్ చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇంతకీ అది ఎక్కడుందంటే..?

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌ (Ladakh)లో సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్‌ స్టేడియం (football & track n field stadium) నిర్మితమైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న మొదటి పది స్టేడియాల్లో ఇదీ ఒకటి. ఒకేసారి 30 వేల మంది కూర్చొని ఆటను వీక్షించవచ్చంటూ స్టేడియం చిత్రాలను ఓ మీడియా సంస్థ షేర్ చేసింది. అవి మహీంద్రాను ఆకట్టుకున్నాయి. వెంటనే ఆయన వాటిని రీట్వీట్ చేస్తూ.. ‘ఆ దృశ్యాలను కళ్లు విప్పార్చి చూడాల్సిందే. ఏదో ఒకరోజు ఇక్కడికి వస్తా. టీవీలో క్రికెట్ చూడటానికి బదులు ఒక ఆదివారం ఇక్కడ ఫుట్‌ బాల్‌ మ్యాచ్ చూస్తా’ అని రాసుకొచ్చారు. నెటిజన్లను ఈ చిత్రాలు మెప్పించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు