Trump: ఎంగిలి పిజ్జా.. ఎవరికి కావాలి.. ట్రంప్‌ మార్క్‌ ఆఫర్‌..!

తన అభిమానులకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ఆఫర్‌ ఇచ్చారు. ఆయన ఆఫర్‌ విని అభిమానులకే వెగటుపుట్టి.. మాకొద్దు అని చెప్పారు. అదేంటో చదివేయండి..

Updated : 24 Apr 2023 14:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చేతిలో చాటంత పిజ్జా పెట్టుకొని.. దానిలోని ఓ ఎంగిలి ముక్కను మాత్రమే తీసి ఎవరికైనా కావాలా అని అడిగితే ఎలా ఉంటుంది.. ఇలాంటి వెకిలిపనే చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌( Donald Trump). తన అభిమానులకు ఎంగిలి పిజ్జా ముక్కను ఆఫర్‌ చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఫోర్ట్‌మేయర్స్‌లో చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ రిపోర్టరు ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

ట్రంప్‌ ఫోర్ట్‌మేయర్స్‌లోని లీ కౌంటీ అనే ప్రాంతంలో రిపబ్లికన్‌ పార్టీ తరపున ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలోని డౌన్‌టౌన్‌ హౌస్‌ ఆఫ్‌ పిజ్జా అనే దుకాణం వద్ద ఆగారు. ట్రంప్‌ అక్కడికి వచ్చిన విషయం తెలుసుకొని సుమారు 100 మంది అభిమానులు పరిగెత్తుకొంటూ వచ్చారు. ఆ తర్వాత ట్రంప్‌ ఓ పెద్ద పిజ్జాను తీసుకొని దానిలో ఓ స్లైస్‌ను అభిమానుల వైపు చూపిస్తూ ‘‘నేను కొరికిన ఈ ముక్క ఎవరైనా తింటారా..?’’ అని అడిగారు. ఆ తర్వాత పిజ్జా ముక్కను కొరికి తిన్నారు. ట్రంప్‌ ఆఫర్‌ విని ఆయన వీరాభిమానులు కూడా కంగుతున్నారు. ఆ తర్వాత వారు ‘నో’ అని పెద్దగా అరిచారు. 

ట్రంప్‌ ఫాస్ట్‌ఫుడ్‌ను ఇష్టంగా ఆరగిస్తారని ఆయన అభిమానులందరికీ తెలుసు. అందులోనూ పిజ్జా అంటే ఆయనకు మరింత ప్రీతి. విదేశీ ప్రయాణాల సమయంలో కూడా ఆయన విమానంలో పిజ్జాలు ఉండాల్సిందేనని సహాయకులు చెప్పేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని