Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 24 May 2024 16:59 IST

1. 16 నెలల్లో మూడింతలు.. ‘హిండెన్‌బర్గ్‌’ తర్వాత మళ్లీ ఆ స్థాయికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ స్టాక్‌ (Adani Enterprises).. దాదాపు ఏడాదిన్నర క్రితం స్టాక్‌ మార్కెట్లో దుమ్మురేపింది. అలాంటి స్టాక్‌ ఓ దశలో రూ.4 వేలు కూడా దాటింది. ఆ సమయంలో తీవ్ర ఆరోపణలతో హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడింది. అంతే ఒక్కసారిగా ఆ స్టాక్‌ కుప్పకూలి 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. అలాంటి స్టాక్‌ విలువ.. మళ్లీ హిండెన్‌బర్గ్ నివేదిక పూర్వస్థాయికి చేరింది. శుక్రవారం ఆ కంపెనీ షేరు రాణించడంతో ఇంట్రాడేలో రూ.3,449 వద్ద నాటి విలువను అందుకుంది. పూర్తి కథనం

2. తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జూన్ 20 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వారికి జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌.. జులై 9న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. పూర్తి కథనం

3. ఆంధ్రప్రదేశ్‌పై ‘రేమాల్‌’ తుపాను ప్రభావం ఉండదు: వాతావరణశాఖ

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపానుకు ‘రేమాల్’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. అది ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్‌ వద్ద 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. పూర్తి కథనం

4. ఆషికా రంగనాథ్‌కు ‘మెగా’ ఛాన్స్‌.. చిరు సినిమాలో ఆఫర్‌

యంగ్‌ హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) బంపర్‌ ఆఫర్‌ అందుకున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara)లో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పూర్తి కథనం

5. వ్యక్తిగత మైలురాళ్ల కంటే.. జట్టు కోసం ఆడేవారిని ఎంచుకోండి: ఆర్సీబీకి రాయుడు సెటైర్

ఐపీఎల్ 2024 సీజన్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టు తీరుపై కామెంట్లు చేసిన సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మేనేజ్‌మెంట్, సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని విమర్శిస్తూనే.. ఆ జట్టు అభిమానులపై ప్రశంసలు కురిపించాడు.  పూర్తి కథనం

6. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. తొలిసారి 23వేల ఎగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. నిన్నటి భారీ లాభాలతో సరికొత్త రికార్డులను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం కూడా ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 75,636.5 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకగా.. నిఫ్టీ తొలిసారి 23 వేలు దాటి 20,026 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. పూర్తి కథనం

7. ఏఐ స్కిల్స్‌ ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు గిరాకీ.. వారికంటే 50% అధిక వేతనం!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఉద్యోగులు సైతం ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నాయి. వారికి అధికంగానే ముట్టజెబుతున్నాయి.  పూర్తి కథనం

8. వార్తలు చదువుతున్నది క్రిష్‌, భూమి.. దూరదర్శన్‌ కిసాన్‌లో ఏఐ యాంకర్లు!

రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్‌ డీడీ కిసాన్‌ (DD Kisan) మే 26తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈసందర్భంగా దూరదర్శన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ కాలం నడుస్తున్న తరుణంలో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. పూర్తి కథనం

9. అది ఒకప్పుడు మా దేశమే అని చెప్పా..: పాక్‌ పర్యటనపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

దాయాది పాకిస్థాన్‌ ఆందోళనలకు ప్రధాన కారణం తానేనని అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi). ఆ దేశం ఎంత శక్తిమంతమైందో తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించానని అన్నారు. ఈసందర్భంగా పొరుగుదేశాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ (Congress) నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. పూర్తి కథనం

10. మాస్కో మారణహోమంలో ఉక్రెయిన్‌ మిలటరీ!

రష్యా (Russia) రాజధాని మాస్కో(Moscow)లోని అతిపెద్ద సంగీత కచేరీ హాలులో ఇటీవల జరిగిన మారణకాండతో ఉక్రెయిన్‌కు సంబంధమున్నట్లు రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) అధిపతి అలెగ్జాండర్‌ బోర్టినికోవ్‌ (Alexander Bortnikov) ఆరోపించారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని