Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 04 May 2023 21:13 IST

1. మాది.. పొంగులేటి, జూపల్లిది ఒక్కటే లక్ష్యం: ఈటల రాజేందర్‌

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుతో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం గురువారం ఖమ్మం వచ్చి భేటీ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?: హరీశ్‌రావు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పందించారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు  మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.‘‘సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?వందే భారత్‌ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా?’’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాజధాని రైతుల పిటిషన్‌పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ రాజధాని అమరావతి కేసులపై సుప్రీం కోర్టులో జులై 11న విచారణ జరగనుంది. చనిపోయిన పిటిషనర్స్‌ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలంటూ పలువురు రైతులు ఎల్‌ఆర్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శరద్‌ పవార్‌ రాజీనామాపై స్పందించిన ఉద్ధవ్‌ ఠాక్రే

ఎన్సీపీ (NCP) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌(Sharad Pawar) తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం  ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు.  పవార్‌ రాజీనామా వ్యవహారం కాంగ్రెస్‌, ఎన్సీపీ శివసేన(ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే)లతో కూడిన మహా వికాస్‌ అఘాడీ(MVA) కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ సిక్స్‌ల వెనుక మర్మమిదే: ఇషాన్‌ కిషన్‌

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) ముంబయి ఇండియన్స్‌  పాయింట్ల పట్టికలో దూసుకొస్తోంది. ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసి ఆరో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్‌ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి ఓపెనర్ ఇషాన్‌ కిషన్ చెలరేగిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మణిపూర్‌లో హింస.. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు!

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur) హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఈ  నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనల్ని కట్టడి చేసేందుకు ‘తీవ్రమైన కేసుల్లో’ కనిపిస్తే కాల్చివేతకు గవర్నర్‌ ఆదేశించినట్టుగా ప్రభుత్వ కమిషనర్‌ (హోం) టి.రంజిత్‌ సింగ్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 4ఏళ్ల చిన్నారిపై హత్యాచారం.. దోషికి క్షమాభిక్ష పెట్టని రాష్ట్రపతి

మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిపై అతి దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో దోషికి క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నిరాకరించారు. 2008 క్రితం నాటి కేసుకు సంబంధించి దోషి వసంత సంపత్‌ దుపారే దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ (mercy petition)ను ఆమె ఇటీవల తిరస్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బంకర్‌లోకి పుతిన్‌.. అమెరికాకు రష్యా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

రష్యా రాజధాని నగరం మాస్కో నడిబొడ్డున క్రెమ్లిన్‌(Kremlin) భవనాలపై రెండు డ్రోన్లు దూసుకురావడం తీవ్ర కలకలం సృష్టించింది. అధ్యక్ష కార్యాలయం, నివాసం ఉన్న ఈ కీలక భవనాలపై ఈ తరహా దాడికి యత్నం జరగడంతో రష్యా(Russia) ఉలిక్కిపడింది. దీనిపై రష్యా అగ్రదేశం అమెరికాను తీవ్రంగా విమర్శించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాజు పట్టాభిషేకానికి.. డబ్బావాలాలనుంచి ఉపరాష్ట్రపతి వరకు..!

రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్‌లో (Britain).. రాజు పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుకను లక్షల మంది ప్రత్యక్షంగా తిలకించడంతోపాటు టీవీల్లో కోట్ల మంది చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జరగనున్న ఈ మహా ఆర్భాటానికి ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు, ప్రముఖులు, అతిథులకు ఆహ్వానం అందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 76 కోట్ల మంది చేతిలో ఇంటర్నెట్‌.. వినోదానికే అధిక వినియోగమట! 

ఇంటర్నెట్‌ వినియోగం (Internet Usage)లో భారత్‌ దూసుకెళ్తోంది. 2022 నాటికి దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు(నగర, గ్రామీణ ప్రాంతాలు కలిపి) నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు తాజాగా ఓ నివేదికలో తేలింది. దేశ జనాభాలో సగానికిపైగా(75.9 కోట్ల మంది/ 52 శాతం) అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే మొదటిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు