Manipur Violence: మణిపూర్‌లో హింస.. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు!

Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో పరిస్థితిని అదుపుచేయలేని విధంగా తీవ్రమైన పరిస్థితులు ఎదురైతే కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశించింది.

Updated : 04 May 2023 18:53 IST

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur) హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఈ  నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనల్ని కట్టడి చేసేందుకు ‘తీవ్రమైన కేసుల్లో’ కనిపిస్తే కాల్చివేతకు గవర్నర్‌ ఆదేశించినట్టుగా ప్రభుత్వ కమిషనర్‌ (హోం) టి.రంజిత్‌ సింగ్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని.. ఒకవేళ పరిస్థితిని నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడితే  కాల్పులకు అవకాశం కల్పిస్తూ గవర్నర్‌ తరఫున జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అనేకచోట్ల చెలరేగిన ఈ హింసను నియంత్రించేందుకు 55 కంపెనీలతో కూడిన ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ సిబ్బందిని  మోహరించారు. అలాగే, మళ్లీ హింసాత్మక ఘటనలు చెలరేగితే రంగంలోకి దించేందుకు మరో 14 బృందాలను సిద్ధంగా ఉంచినట్టు రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. మణిపూర్‌లో పరిస్థితిని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ సాయంత్రానికే ఇంఫాల్‌ విమానాశ్రయానికి మరికొన్ని భద్రతా బృందాలు చేరుకున్నాయి.  ఇంకోవైపు,  హింస ప్రబలే అవకాశమున్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది.  మెజార్టీ మెయితీ కమ్యూనిటీని షెడ్యూల్‌ తెగలో చేర్చే చర్యల్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు