Amaravati: రాజధాని రైతుల పిటిషన్‌పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ

రాజధాని రైతులు దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Updated : 04 May 2023 20:06 IST

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కేసులపై సుప్రీం కోర్టులో జులై 11న విచారణ జరగనుంది. చనిపోయిన పిటిషనర్స్‌ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలంటూ పలువురు రైతులు ఎల్‌ఆర్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. రాజధాని అమరావతి కేసును గత విచారణలో ధర్మాసనం జులై 11కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని