Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. నదుల అనుసంధానానికి తెలుగు రాష్ట్రాలు ఓకే.. కానీ..!
గోదావరి-కావేరీ (Godavari-Kaveri) నదుల అనుసంధానంపై తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయని నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. డీపీఆర్‌పై ఇప్పటికే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలిపాయన్న ఆయన.. తమ ప్రాజెక్టులను ఆమోదించిన తర్వాతే మిగులు జలాలను తీసుకుంటే ఇబ్బంది లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చెప్పాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నవీన్ హత్యకేసు.. నిందితుల జాబితాలో హరిహరకృష్ణ స్నేహితురాలు
నగర శివారులో ఇటీవల జరిగిన నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల జాబితాలో హరిహరకృష్ణ స్నేహితురాలి పేరును కూడా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చేర్చారు. యువతి కోసమే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసినట్లు నిర్ధారించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా యువతిపై కేసు నమోదు చేశారు. ఏ2గా హసన్, ఏ3గా యువతి పేరును చేర్చి.. ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. సీఎం కుమార్తె వాచ్‌కు ఉన్న విలువ వైద్య విద్యార్థిని ప్రాణానికి లేదు: బండి సంజయ్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) విమర్శించారు. భారాస (BRS) పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన నిరసన దీక్ష చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. నిరుద్యోగులకు నెలకు రూ.2500 భృతి.. భూపేశ్ బఘేల్ సర్కారు వరాలు
ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ యువకులకు భృతి, అంగన్వాడీలకు వేతనాలు పెంపు వంటి తాయిలాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఆ రాష్ట్రం రూ.1.21 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం భూపేశ్ బఘేల్ స్వయంగా బడ్జెట్‌ను చదివి వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. TSRTC నుంచి ఒలెక్ట్రాకు భారీ ఆర్డర్.. విజయవాడకు ఇక విద్యుత్ బస్సులు
మేఘ ఇంజినీరింగ్ కంపెనీ అనుబంధ విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (Olectra) మరో భారీ ఆర్డర్ దక్కించుకుంది. 550 బస్సుల సరఫరాకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుంచి ఆర్డర్ లభించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాది నుంచి ఇంత భారీ స్థాయిలో ఆర్డర్ దక్కడం ఇదే తొలిసారి అని ఆ కంపెనీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కోహ్లీ పరుగుల కరవులో ఉన్నాడు.. బ్యాటర్లకు ఈ సిరీస్ పీడ కల: రికీ పాంటింగ్
మూడేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శతకం బాది తిరిగి ఫామ్‌లోకి వచ్చిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు సెంచరీ బాది మూడేళ్లు దాటిపోయింది. టెస్టుల్లో చివరగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 111 పరుగులు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. చార్‌ధామ్ యాత్రలో.. డ్రోన్లు.. అత్యాధునిక అంబులెన్సులు!
గతేడాది చార్‌ధామ్ యాత్రలో భాగంగా మార్గమధ్యలో పెద్దసంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం కలవరపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి యాత్రికుల ఆరోగ్య సేవలకు పూర్తి భరోసానిస్తూ.. మూడంచెల పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ విషయమై ఉత్తరాఖండ్ ఆరోగ్య మంత్రి ధన్‌సింగ్ రావత్ సోమవారం మాండవీయతో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. గుజరాత్‌లో లక్షన్నర మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం: మోదీ
గుజరాత్(Gujarat)లో గత ఐదేళ్ల వ్యవధిలో లక్షన్నర మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలిపారు. సోమవారం ఆయన గుజరాత్ రోజ్‌గార్ మేళాలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యాన్ని చేరుకోగలమని చెప్పారు. గతేడాది ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జనాభా ఇలాగే తగ్గిపోతే.. జపాన్ మాయం...!
జపాన్‌లో (Japan) కొంతకాలంగా జననాల రేటు గణనీయంగా పడిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది కూడా ఈ సంఖ్య భారీగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీనిపై ఆ దేశ పాలకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జననాల రేటు క్షీణించడాన్ని (Population Decline) నిరోధించకుంటే జపాన్ అదృశ్యమవుతుందని ప్రధానమంత్రి సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. సెలక్టర్లు రాజీనామా చేయాలి: సునీల్ గావస్కర్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో మొదటి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా (Australia) ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పిచ్‌లను భారత్ తమకు అనుకూలంగా మార్చుకుందని, అందుకే విజయం సాధించిందని ఆసీస్ మాజీ ఆటగాళ్లు, ఆ దేశ మీడియా అక్కసు వెళ్లగక్కింది. అయితే, ఇందౌర్‌లో జరిగిన మూడో టెస్టులో కంగారులు విజయం సాధించడంతో వారి నోళ్లకు తాళం పడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం