Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 20 Apr 2023 20:58 IST

1. ఎయిర్‌పోర్టు మెట్రోకు ముందడుగు.. జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా 3 సంస్థలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంలో  ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు మెట్రోకు జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా సిస్ట్రా, రైట్స్‌ డీబీ ఇంజినీరింగ్‌ సంస్థల కన్సార్టియం ఎంపికైంది. జీఈ కన్సల్టెంట్‌ ఎంపికకు సంబంధించి మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీస్‌ రెడ్డి  ప్రకటన విడుదల చేశారు. జనరల్‌ కన్సల్టెంట్‌ ఎంపిక కోసం మొత్తం 5 అంతర్జాతీయ కన్సార్టియంలు పోటీపడ్డాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి: సీఎం జగన్‌ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమశాఖలో ఉన్న ఖాళీలనూ భర్తీ చేయాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముగిసిన విశాఖ ఉక్కు బిడ్ల గడువు.. ఆసక్తి చూపిన 29 సంస్థలు

వర్కింగ్‌ క్యాపిటల్‌, ముడిసరకు కోసం విశాఖ ఉక్కు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) బిడ్ల దాఖలుకు గురువారంతో గడువు ముగిసింది. మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏడు విదేశీ సంస్థలు ఈవోఐ దాఖలు చేశాయని కార్మిక సంఘం నేత అయోధ్యరామ్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆసక్తి చూపినట్టు సమాచారం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఒకే స్థానం నుంచి డీకే బ్రదర్స్‌ నామినేషన్‌.. కారణం ఇదేనట..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ గడువు నేటితో ముగిసింది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఆయా స్థానాలనుంచి రంగంలోకి దించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరు రూరల్‌ ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ నేత డీకే సురేష్‌ (DK Suresh).. కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఐడియాలిస్తాం.. గెలిపిస్తాం.. కర్ణాటకలో వ్యూహకర్తలకు డిమాండ్‌

కర్ణాటక ఎన్నికల (karnataka Elections) వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్ల గడువు కూడా నేటితో పూర్తి కానుండటంతో అభ్యర్థులు బరిలోకి దిగే స్థానాల్లోనూ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులను ప్రచారానికి రప్పించి.. ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దేశంలో భారీగా పెరిగిన ఎల్పీజీ కనెక్షన్లు.. 9 ఏళ్లలో డబుల్‌

దేశంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గడిచిన 9 ఏళ్లలో కొత్తగా 17 కోట్ల వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నారు. దీంతో 2014 ఏప్రిల్‌లో 14.52 కోట్లుగా ఉన్న గ్యాస్‌ వినియోగదారుల సంఖ్య 2023 నాటికి 31.36 కోట్లకు చేరింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ఇందుకు దోహదం చేసింది. అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అదరగొట్టిన సిరాజ్‌.. బెంగళూరుదే విజయం

ఐపీఎల్‌-16 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌కు మూడో విజయం. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.  టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.  లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్‌ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టెలిగ్రామ్‌ తరహాలో వాట్సాప్‌ యానిమేటెడ్‌ ఎమోజీలు!

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ కావడం, మెసేజింగ్‌ నుంచి గ్రూప్‌ కాలింగ్ వరకు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉండటంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. గత కొద్ది నెలలుగా వాట్సాప్‌ (WhatsApp) ప్రతి నెలా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. వాటిలో కొన్ని ఫీచర్లు ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడి వల్లే ఆర్మీ ట్రక్కులో మంటలు.. ఐదుగురు సైనికుల సజీవదహనం!

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు మృతిచెందిన ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు సైన్యం నిర్ధారించింది. పిడుగు పాటు వల్లే ట్రక్కులో మంటలు చెలరేగి ఉంటాయని తొలుత భావించినప్పటికీ.. ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడులు చేయడం వల్లే ఈ విషాదం చోటుచేసుకున్నట్టు సైనిక అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. స్టార్‌షిప్‌ ప్రయోగం విఫలం.. గాల్లోనే పేలిపోయిన అతిపెద్ద రాకెట్‌!

ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ (SpaceX) చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ‘స్టార్‌షిప్‌ (Starship)’ ప్రయోగం విఫలమైంది. అమెరికా (America) దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్‌.. కొద్దిసేపటికే పేలిపోయింది. టెస్ట్‌ ఫ్లైట్‌లో భాగంగా ఈ వ్యోమనౌక రెండు సెక్షన్లు (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌).. నిర్ణీత సమయం (3 నిమిషాలు)లోగా విడిపోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని