WhatsApp: టెలిగ్రామ్‌ తరహాలో వాట్సాప్‌ యానిమేటెడ్‌ ఎమోజీలు!

మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) త్వరలో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు సరికొత్త మెసేజింగ్ అనుభూతిని పొందుతారని వాట్సాప్ భావిస్తోంది.

Published : 20 Apr 2023 18:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ కావడం, మెసేజింగ్‌ నుంచి గ్రూప్‌ కాలింగ్ వరకు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉండటంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. గత కొద్ది నెలలుగా వాట్సాప్‌ (WhatsApp) ప్రతి నెలా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. వాటిలో కొన్ని ఫీచర్లు ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా, మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. 

వాట్సాప్‌లో యూజర్లు తమ స్పందనను తెలియజేసేందుకు ఎమోజీలను ఉపయోగిస్తుంటారు. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్‌ యాప్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఓఎస్‌లు ఇస్తున్న ఎమోజీలను మాత్రమే యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఇకపై, వాట్సాప్‌ సొంతంగా ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. టెలిగ్రామ్‌ యాప్‌లో మాదిరి యానిమేటెడ్‌ ఎమోజీలను వాట్సాప్‌ యూజర్లకు పరిచయం చేయనుంది. లొట్టీ లైబ్రరీ సాయంతో ఈ యానిమేటెడ్‌ ఎమోజీలను రూపొందిస్తున్నట్లు సమాచారం. కొత్త తరహా ఎమోజీలతో యూజర్లు సరికొత్త మెసేజింగ్ అనుభూతిని పొందుతారని వాట్సాప్ భావిస్తోంది. 

వాట్సాప్‌ త్వరలో వీడియో మెసేజ్‌, లాక్‌ చాట్‌, డిస్‌అప్పియర్ మెసేజెస్‌ అప్‌డేట్‌ ఫీచర్లను పరీక్షిస్తోంది. వీడియో మెసేజ్‌ ఫీచర్‌తో యూజర్లు 60 సెకన్ల నిడివితో వీడియోను రికార్డ్‌ చేసి కాంటాక్ట్స్‌లోని వారికి షేర్‌ చేయొచ్చు. ఇది పంపిన వెంటనే అవతలి వ్యక్తికి వీడియో మెసేజ్‌ అని కనిపిస్తుంది. లాక్‌ చాట్‌తో యూజర్లు తమ ప్రైవేట్‌ చాట్‌లకు లాక్‌ విధించుకోవచ్చు. దీంతో ఇతరులెవరూ లాక్‌ చేసిన చాట్‌ను చూడలేరు. డిస్‌అప్పియర్‌ మెసేజెస్‌లో కొత్తగా 15 ఆప్షన్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఉన్న 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజుల టైమ్‌ ఆప్షన్లకు ఇవి అదనం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని