Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 23 Jan 2023 21:12 IST

1. సీఎం జగన్‌ అలా అంటే.. నేనైనా వైదొలగాల్సిందే: మాజీ మంత్రి బాలినేని

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వకపోవచ్చని అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ రాకపోవచ్చు’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్‌దారులకు డీఏ చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్‌ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒకే బంతికి 16 పరుగులు సమర్పించుకున్న బౌలర్‌

బిగ్‌ బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌, హోబర్ట్ హరికేన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బౌలర్‌ ఒక బంతి పూర్తయ్యేలోగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిడ్నీ సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ని ఆసీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ జోయెల్ పారిస్‌ వేశాడు. ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను ఎదుర్కొన్న స్టీవ్‌ స్మిత్ ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. మూడో బంతికి మాత్రం స్మిత్‌ సిక్సర్ బాదాడు. ఆ బంతిని అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విమానంలో వికృత చేష్టలు.. ఈసారి దిల్లీ-హైదరాబాద్‌ ఫ్లైట్‌లో..

విమానాల్లో ప్రయాణికుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడం.. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తి ఊచలు లెక్కిస్తున్నా ఇతరులు పాఠాలు నేర్వడం లేదు. తాజాగా దిల్లీ- హైదరాబాద్‌ స్పైస్‌జెట్‌ (Spicejet) విమానంలో ఓ ప్రయాణికుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో అతడిని సెక్యూరిటీ అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అత్యవసరంగా రమ్మని.. ఇంటికెళ్లిపొమ్మని!

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 18,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇదొక్కటే కాదు, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి పెద్దపెద్ద సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత వేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు లే ఆఫ్‌ల పేరుతో జీతానికి గండి కొడుతున్నాయి. దీనిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉన్న కొలువు.. రేపు ఉంటుందో లేదోనని భయపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాజీనామా చేయాలనుకుంటున్నా.. మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీ సంచలన ప్రకటన

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్ కోశ్యారీ (Bhagat Singh Koshyari) సంచలన విషయాన్ని ప్రకటించారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలిపానని వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో 80 ఏళ్ల  కోశ్యారీ తన గవర్నర్‌ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అప్పుడు చనిపోతానేమో అనుకున్నా: ఎలాన్‌ మస్క్‌

టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ (Elon Musk) సామాజిక మాధ్యమాల్లో ఇటీవల హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన  తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాటిపై యూజర్ల కామెంట్లు, రీ ట్వీట్లతో ‘మస్క్‌’ పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని ఈ మధ్య కాలంలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఆయన చేసిన పోస్టు దుమారం రేపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మేరీకోమ్‌ కమిటీకే రెజ్లింగ్ సమాఖ్య బాధ్యతలు

మహిళా రెజర్ల(wrestlers)పై వేధింపుల ఆరోపణల విషయంలో కీలక నిర్ణయం వెలువడింది. లైంగిక వేధింపుల ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు కేంద్రం పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ బాక్సర్‌, రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీకోమ్(Mary Kom) నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఇకనుంచి నెల రోజులు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) రోజువారీ వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హోండా నుంచి కొత్త యాక్టివా.. సర్వీసింగ్‌ అలర్ట్‌ సహా మరిన్ని ఫీచర్లు

హోండా మోటార్‌ సైకిల్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) తన విజయవంతమైన మోడల్‌ యాక్టివాకు (Honda Activa) కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. యాక్టివా 6జీ H-smart పేరిట దీన్ని తీసుకొచ్చింది. దీని ధరను రూ.74,536 (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. రాబోయే ఉద్గార ప్రమాణ నిబంధనలకు అనుగుణంగా కొత్త యాక్టివాను తీర్చిదిద్దారు. మొత్తం మూడు వేరియంట్లను తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. దక్షిణాదికి త్వరలో మరో 3 ‘వందే భారత్‌’ రైళ్లు.. తిరుపతి రూట్‌లో ఒకటి?

దక్షిణాదికి త్వరలో మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాబోతున్నాయ్‌..! దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతోన్న భారతీయ రైల్వే మరో మూడు సెమీ హైస్పీడ్‌ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు; సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి; సికింద్రాబాద్‌ నుంచి పుణె నగరాల మధ్య సర్వీసులందించనున్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని