Telangana News: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 23 Jan 2023 19:33 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్‌దారులకు డీఏ చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్‌ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం (DA) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 17.29 నుంచి 20.02 శాతానికి పెంచినట్లు తెలిపారు. డీఏ పెంపుతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని