SpiceJet: విమానంలో వికృత చేష్టలు.. ఈసారి దిల్లీ-హైదరాబాద్‌ ఫ్లైట్‌లో..

దిల్లీ- హైదరాబాద్‌ స్పైస్‌జెట్‌ విమానంలో ఓ ప్రయాణికుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో అతడితో పాటు అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని సెక్యూరిటీకి అప్పగించారు.

Published : 23 Jan 2023 19:50 IST

దిల్లీ: విమానాల్లో ప్రయాణికుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడం.. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తి ఊచలు లెక్కిస్తున్నా ఇతరులు పాఠాలు నేర్వడం లేదు. తాజాగా దిల్లీ- హైదరాబాద్‌ స్పైస్‌జెట్‌ (Spicejet) విమానంలో ఓ ప్రయాణికుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో అతడిని సెక్యూరిటీ అప్పగించారు.

దిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరాల్సిన  విమానంలో ఓ ప్రయాణికుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడని స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ తెలిపింది. అనుచితంగా ప్రయాణించడంతో పాటు కేబిన్‌ సిబ్బందిని సైతం వేధించాడని పేర్కొంది. ఈ ఘటనపై పైలట్‌ ఇన్‌ కమాండ్‌కు తెలియజేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి సైతం విషయాన్ని చేరవేసినట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది. దీంతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తితో పాటు అతడితో పాటు కలిసి ప్రయాణిస్తున్న వ్యక్తిని సైతం విమానం నుంచి దించివేశారని, సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వరమే తెలిజేయాలని ఇటీవల డీజీసీఏ ఆదేశించిన నేపథ్యంలో జరిగిన వెంటనే స్పైస్‌జెట్‌ ఈ విషయాన్ని బయటపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని