Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 26 May 2023 20:56 IST

1. వివేకా మృతి విషయం జగన్‌కు తెలుసు.. అవినాష్‌రెడ్డే చెప్పారా?: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్‌లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది. వివేకా మృతి విషయం జగన్‌కు ఉదయం 6.15 గంటలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. ‘‘వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే వివేకా మృతి విషయం జగన్‌కు తెలుసు. జగన్‌కు అవినాష్‌రెడ్డే  చెప్పారా? అనేది దర్యాప్తు చేయాల్సి ఉంది’’ అని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. హైదరాబాద్‌కు దిల్లీ సీఎం.. కేసీఆర్‌తో భేటీ కానున్న కేజ్రీవాల్

కేంద్రం ఆర్డినెన్స్‌పై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు విపక్ష నేతలను ఆయన కలిశారు. దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్‌ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మోదీ 9 ఏళ్ల పాలన.. కాంగ్రెస్‌ 9 ప్రశ్నలు

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భాజపా (BJP) పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే, ఎన్డీయే సర్కారు 9 ఏళ్ల పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్‌ (Congress).. మోదీకి తొమ్మిది ప్రశ్నలు సంధించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి అంశాలను ప్రస్తావిస్తూ హస్తం పార్టీ కేంద్రంపై ధ్వజమెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు శరత్‌బాబు మరణవార్తను మరవక ముందే ప్రముఖ దర్శకుడు కె.వాసు (K Vasu) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మా టీమ్‌తోపాటు ఫైనలిస్ట్‌ చెన్నై స్ట్రాంగ్‌ కాదు.. నా ఛాయిస్‌ మాత్రం అదే: గ్రీన్‌

ఐపీఎల్‌ 2023 సీజన్‌ (IPL 2023) ముంబయి ఆడిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీతో అదరగొట్టిన కామెరూన్‌ గ్రీన్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ లఖ్‌నవూపై విలువైన 40 పరుగులు చేశాడు. అదేవిధంగా లఖ్‌నవూ ఆలౌట్‌ కావడంలో కీలకమైన రనౌట్లలోనూ భాగస్వామి కావడం విశేషం. నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్‌ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రిజర్వాయర్‌లో పడిపోయిన ఫోన్‌.. 21 లక్షల లీటర్లు ఖాళీ చేయించిన అధికారి!

రిజర్వాయర్‌లో పడిపోయిన తన ఫోన్‌ కోసం ఓ ప్రభుత్వ అధికారి.. అందులోంచి ఏకంగా 21 లక్షల లీటర్ల నీళ్లను ఖాళీ చేయించారు. దీని కోసం రెండు భారీ మోటర్లను మూడు రోజులపాటు నిరంతరాయంగా నడిపించడం గమనార్హం.. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో.. అధికార దుర్వినియోగంతోపాటు సంబంధిత విభాగం నుంచి సరైన అనుమతి తీసుకోలేదనే ఆరోపణల కింద ఆ అధికారిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. రాజకీయాలు చేయడానికీ ఓ హద్దు ఉండాలి.. జైశంకర్‌

పార్లమెంట్‌ నూతన భవనం(New Parliament Building) ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని 20 రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌(Jai shankar) స్పందించారు. ఆయా పార్టీల తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేయడానికి కూడా ఒక హద్దు  ఉండాలని ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. హాట్‌టాపిక్‌గా మారిన రాజదండం.. కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌షా

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ.. ‘రాజదండం’ చర్చనీయాంశమైంది. అది కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారితీసింది. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ఈ రాజదండం ప్రతీక అని కేంద్రం చెప్తుండగా.. అందుకు లిఖితపూర్వకమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. తాజాగా దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. నిధుల కోసం జెలెన్‌స్కీ ఇంటిని విక్రయించనున్న రష్యా..!

ఉక్రెయిన్‌పై చేపడుతోన్న సైనిక చర్యను కొనసాగించేందుకు రష్యా నిధులు సేకరిస్తోంది. అందుకోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంటిని విక్రయించనుంది. ఆశ్చర్యమనిపించినా అది నిజం. అయితే, ఆ ఇల్లు క్రిమియా ప్రాంతంలో ఉండటంతో రష్యా ఈ సాహసం చేస్తోంది. 2014లో రష్యా దళాలు ఉక్రెయిన్‌ నుంచి క్రిమియాను ఆక్రమించుకొన్నాయి. దాని పాలనా వ్యవహారాల కోసం రష్యా ఒక క్రిమియన్‌ నేతను నియమించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అతడి గురించి చింతించకండి.. ఎప్పుడూ నాతోనే ఉంటాడు : పతిరణ సోదరితో ధోనీ

ఐపీఎల్‌ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings).. ముంబయి రికార్డును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐపీఎల్‌ చరిత్రలో రోహిత్‌ సేన అత్యధికంగా ఐదు టైటిళ్లను గెలవగా.. ధోనీ సేన నాలుగు టైటిళ్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక చెన్నైతో ఫైనల్‌లో తలపడనున్న జట్టు నేటి క్వాలిఫయర్‌ 2లో తేలనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని