Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 28 Apr 2024 21:00 IST

1. 30న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తాం: పవన్‌ కల్యాణ్‌

ఎల్లుండి (ఈనెల 30)న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు. ‘‘మాఫియా డాన్‌లతో పోరాడుతున్నాం.. మన దశ దిశ మార్చుకునే ఎన్నికలివి’’ అని పవన్‌ అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ ప్యాలెస్‌ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుంది: చంద్రబాబు

 జగన్‌ ప్యాలెస్‌ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమీకరణల ప్రకారం కర్నూలు జిల్లాలో టికెట్లు ఇచ్చామన్నారు. వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.ఎస్‌బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులు.. ప్రయోజనాలివే..!

తరచూ విమాన ప్రయాణాలు చేసేవారిని దృష్టిలో ఉంచుకొని ఎస్‌బీఐ కార్డు ఇటీవల ప్రత్యేక క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. దీంట్లో ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌, మైల్స్‌ ఎలైట్‌, మైల్స్‌ ప్రైమ్‌ పేరిట మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిపై లభించే ట్రావెల్‌ క్రెడిట్లను ఎయిర్‌ మైల్స్‌, హోటల్‌ పాయింట్లు, రివార్డులు, లాంజ్‌ యాక్సెస్‌లుగా మార్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మే, జూన్‌ నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ

 పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు  పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ .. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. సింధియాల పోరు.. తల్లి ఓటమి కోసం ప్రచారం చేసిన వేళ!

దేశంలో సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) కోలాహలం కొనసాగుతోంది. పార్టీలకు రెబల్‌గా కొందరు మారుతుంటే.. మరికొన్ని చోట్ల సొంత కుటుంబం నుంచే ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నవారూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నతల్లికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాధవరావు సింధియా (Madhavrao Scindia).. ఓటర్లను ఒక్క రూపాయి విరాళం కోసం చేతులు చాచిన కాన్షీరామ్‌ (Kanshi Ram).. వంటి పలు ఆసక్తికర విషయాలను సీనియర్‌ జర్నలిస్టు భాస్కర్‌ రాయ్‌ రాసిన ‘ఫిఫ్టీ ఇయర్‌ రోడ్‌’ పుస్తకంలో ప్రస్తావించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. జగన్‌ వాగ్దానాలన్నీ.. మద్యం బ్రాండ్‌లకే పరిమితం: వైఎస్‌ షర్మిల

జగన్ పాలనలో మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలు నిలబెడతారనే ప్రజలు జగన్‌కు ఓట్లేశారని అన్నారు. వైఎస్‌ఆర్‌ పాలనకు, జగన్‌ పాలనకు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ప్రధాని ఎవరైనా.. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌: చిదంబరం

 ప్రధానమంత్రి పదవిలో ఎవరున్నా సరే.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం (Chidambaram) అన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా జరగబోయే పరిణామాన్నే తన ‘గ్యారంటీ’గా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనో ‘అతిశయోక్తి నేత’ అని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ₹602 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు

దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్‌ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(NCB) ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(NCB) చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా రూ.602 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. చైనాతో చర్చలు.. భారత్‌ ఎప్పుడూ తలవంచదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చైనాతో జరుపుతున్న చర్చలు సజావుగా, సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. భారత్‌ ఎప్పుడూ తలవంచదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!

 ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్‌ (Dubai) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న ‘దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌’లోని అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 35 బిలియన్‌ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్‌ నిర్మించనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని