icon icon icon
icon icon icon

LS Polls: ప్రధాని ఎవరైనా.. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌: చిదంబరం

ప్రధాని నరేంద్ర మోదీని ‘అతిశయోక్తుల నేత’గా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరం విమర్శించారు.

Published : 28 Apr 2024 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధానమంత్రి పదవిలో ఎవరున్నా సరే.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం (Chidambaram) అన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా జరగబోయే పరిణామాన్నే తన ‘గ్యారంటీ’గా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనో ‘అతిశయోక్తి నేత’ అని విమర్శించారు. భారత్‌ తన జనాభాతో ఈ ఘనత సాధిస్తుందని, అందులో మ్యాజిక్‌ ఏమీ లేదని ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘జీడీపీపరంగా 2004లో భారత్‌ ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. 2014 నాటికి ఏడో స్థానానికి చేరుకుంది. 2024లో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా ప్రధానిగా ఎవరున్నా.. మూడో స్థానానికి చేరుకుంటుంది. ఇందులో ఎటువంటి మాయాజాలం లేదు. మనకున్న జనాభాతోనే ఇది సాధ్యమవుతుంది’’ అని చిదంబరం పేర్కొన్నారు. ‘‘ఒక దేశపు జీడీపీ పరిమాణం దాని ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు నిజమైన కొలమానం కాదు. తలసరి ఆదాయం కచ్చితమైన సూచిక. అయితే, ఈ విషయంలో దేశం చాలా వెనుకబడి ఉంది’’ అని తెలిపారు.

నవాబులు, సుల్తాన్‌ల అరాచకాలపై మౌనమా?: రాహుల్‌పై మోదీ ధ్వజం

కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో ‘సీఏఏ’ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కకుపెట్టిందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ వివాదాస్పద చట్టాన్ని పార్టీ వ్యతిరేకిస్తోంది. దీనికి సంబంధించిన కేసులు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. తీర్పు ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం’’ అని చెప్పారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే జమ్మూ-కశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ‘‘ఆర్టికల్ 370 విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే తుది తీర్పును వెలువరించింది. దాంతో ఏకీభవించవచ్చు.. లేదా, అంగీకరించకపోవచ్చు. కానీ అది చట్టం’’ అని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ నేతకు ఏ రాష్ట్రంలోనూ రాజకీయ పునాదులు లేవని, ఒకవేళ తమిళనాడులో పోటీ చేసి ఉంటే ఘోరంగా ఓడిపోయేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల సమరంలో భాజపాకు అతిపెద్ద ఆయుధం.. ఎన్నికల బాండ్ల ద్వారా కూడగట్టిన డబ్బేనని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img