Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 Mar 2024 17:01 IST

1.  మద్యం కేసులో ‘కింగ్‌పిన్‌’ ఆయనే.. కోర్టుకు వెల్లడించిన ఈడీ

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి (Excise policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.  10 రోజుల రిమాండ్ కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈ-కామర్స్ సైట్లలోనూ ఎన్నికల హడావుడి

దేశవ్యాప్తంగా ఎన్నికల (Lok sabha Elections) సందడి నెలకొంది. పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులు సభలు, సమావేశాల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఈ హడావుడి ఇప్పుడు ఈ-కామర్స్‌ సైట్లలోనూ కనిపిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆలయంలో వైకాపా ఎన్నికల ప్రచారమా?

ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానం వైకాపా నేతలకు అడ్డాగా నిలిచింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు వైకాపా తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడమే ఇందుకు నిదర్శనం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వరల్డ్‌ డ్రగ్‌ డాన్‌ను మించిన ఆంధ్రా డాన్‌..!: ఎంపీ రఘురామ

విశాఖ డ్రగ్స్‌ ఘటనపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. విశాఖలో పట్టుబడిన మాదకదవ్యాల కంటైనర్‌కు, పురందేశ్వరి వియ్యంకుడు కె.వి.ప్రసాద్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పురందేశ్వరి, చంద్రబాబు పేరు వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వైకాపా యత్నిస్తోందన్నారు. తాను తప్పు చెప్పినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. వరల్డ్ డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్‌ను తలదన్నెలా మన ఆంధ్రా డాన్ తయారయ్యారని మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన భారాస

లోక్‌సభ ఎన్నికలకు భారాస (BRS) మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (Danam Nagender)కు తెలంగాణ హైకోర్టు (TS High Court) నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ భారాస నేత విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సుంకర నరేశ్‌ వాదనలు వినిపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భాజపా నాలుగో జాబితా.. విరుదునగర్‌ నుంచి రాధికా శరత్‌ కుమార్‌

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మరో జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) శుక్రవారం విడుదల చేసింది. పుదుచ్చేరీలోని ఒకటి, తమిళనాడులోని 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రముఖ సినీనటి రాధికా శరత్‌ కుమార్‌ (Raadhika Sarathkumar) విరుదునగర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.  ఐపీఎల్‌ వేళ జియో కొత్త ప్లాన్‌.. రూ.49తో 25జీబీ డేటా

ఐపీఎల్‌ వేళ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) కొత్త డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌ (prepaid plan) యూజర్ల కోసం ‘‘అన్‌లిమిటెడ్‌ డేటా’’ పేరుతో రూ.49 రీఛార్జి ప్లాన్‌ ప్రవేశపెట్టింది. జియో తీసుకొచ్చిన కొత్త డేటా ప్లాన్‌ ఒక రోజు వ్యాలిడిటీతో 25జీబీ డేటా అందిస్తోంది. యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌ ఉంటేనే దీన్ని రీఛార్జ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాంగ్రెస్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

తమ పార్టీ ఆదాయపు పన్ను చెల్లింపుపై ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలనను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ (Congress) దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు నేడు కొట్టేసింది. దీన్ని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, జస్టిస్‌ పురుషీంద్ర కుమార్‌ కౌరవ్‌లతో కూడిన బెంచ్‌ విచారించింది. అనంతరం తీర్పు వెలువరిస్తూ ఆ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఒకరి మృతి..

బిహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. 30 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ కౌశల్‌ కుమార్‌(Kaushal Kumar) తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని