Dwarka Tirumala: ఆలయంలో వైకాపా ఎన్నికల ప్రచారమా?

ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానం వైకాపా నేతలకు అడ్డాగా నిలిచింది. 

Published : 22 Mar 2024 16:35 IST

ద్వారకా తిరుమల: ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానం వైకాపా నేతలకు అడ్డాగా నిలిచింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు వైకాపా తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడమే ఇందుకు నిదర్శనం.

ట్రస్ట్‌బోర్డు సభ్యుడు యానాదయ్య దేవస్థానం కేశఖండనశాలలో క్షురకులను కలిసి వైకాపాకు ఓటు వేసి జగన్‌ను గెలిపించాలని కోరారు. వైకాపా సిద్ధం పేరుతో ఉన్న కరపత్రాలను వారికి పంపిణీ చేశారు. ఆలయంలో ఎన్నికల ప్రచారం చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈవో స్పందించకపోవడం పట్ల  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఈవో వైకాపాకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైకాపా ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు దేవస్థానంలో భోజనాలు ఏర్పాటు చేయడంపై  ఈవో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఉన్నతాధికారులు ఈవోను బదిలీ చేసినా వైకాపా నేతల అండదండలతో రద్దు చేయించుకోగలిగారు. ఈ కారణంగానే వెంకన్న క్షేత్రంలో వైకాపాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఈవో నోరు మెదపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కేశఖండనశాలలో వైకాపా కరపత్రాలు పంచిన విషయం తన దృష్టికి రాలేదని ఈవో చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని