Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Mar 2023 09:27 IST

1. జగనన్న విద్యాదీవెన మళ్లీ వాయిదా

జగనన్న విద్యాదీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసింది. సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం గత నెల 28న విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఈ నెల 7వ తేదీకి మార్చింది. తాజాగా దాన్ని మళ్లీ వాయిదా వేసినట్లు జిల్లాలకు సమాచారం పంపింది. తదుపరి తేదీని ప్రకటించలేదని జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ.700 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కోర్సుల్లో కొత్తరకం... డిజిటల్‌ హ్యుమానిటీస్‌!

హ్యుమానిటీస్‌ ఎప్పటి నుంచో ఉన్న సబ్జెక్ట్‌. మారుతున్న నేటి కాలానికి అనుగుణంగా దీనికి అనుబంధంగా వచ్చిందే ‘డిజిటల్‌ హ్యుమానిటీస్‌’. కంప్యూటర్‌తోనే సర్వం ముడిపడి ఉన్న ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనవిధానం గురించి అధ్యయనం చేసే ఈ కోర్సుకు రానురానూ డిమాండ్‌ పెరుగుతోంది. మరి దీని గురించి ఇంకా తెలుసుకుందామా... హ్యుమానిటీస్‌లో ఉన్న వివిధ రకాల సబ్జెక్టులను డిజిటల్‌ ప్రపంచంతో కలిపి చూడటాన్నే ‘డిజిటల్‌ హ్యుమానిటీస్‌’ అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రెటీనా రంధ్రం పూడ్చకపోతే?

మనకు చూపు కనిపించటానికి తోడ్పడేది రెటీనానే. ఇది దృశ్యాలను గ్రహించి, వాటిని విద్యుత్‌ సంకేతాల రూపంలో దృశ్యనాడి ద్వారా మెదడుకు చేరవేస్తుంది. దీనికి రంధ్రం పడితే చూపు దెబ్బతింటుంది. రెటీనాలో చాలావరకు మాక్యులా అనే మధ్యభాగంలో రంధ్రం పడుతుంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం గలవారికి దీని ముప్పు ఎక్కువ. మాక్యులార్‌ ఎడీమా కూడా కారణం కావొచ్చు. ఇందులో రెటీనా క్రమంగా ఉబ్బుతూ.. ఉన్నట్టుండి రంధ్రం పడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మసితో.. అందాన్ని కప్పేసి!

పుట్టింది ఉర్దూ మాట్లాడే సంప్రదాయ ముస్లిం కుటుంబంలో! అయినా నటనమీద ఆసక్తితో పట్టుబట్టి శిక్షణ తీసుకున్నారు. 30 ఏళ్ల వయసులో సినిమాల్లో అడుగుపెట్టారు. ఇప్పట్లా కాదు. అప్పుడు అన్నీ మూకీ సినిమాలే. సంభాషణలుండేవి కాదు. పైగా మహిళలకు అవకాశమే ఉండేది కాదు. ఆడవాళ్ల పాత్రలనూ మగవాళ్లే చేసేవారు. అలాంటి సమయంలో పట్టుబట్టి అవకాశం దక్కించుకున్నారు ఫాతిమా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గర్భంలో ఉన్నప్పటి నుంచే సంస్కార పాఠాలు

గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువులకు సంస్కారాన్ని అలవరిచేలా గర్భిణులకు ‘గర్భ సంస్కార్‌’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ ‘సంవర్ధినీ న్యాస్‌’ ప్రారంభించింది. దీనివల్ల శిశువులకు విలువలు, సంస్కృతిపై అవగాహన ఏర్పడుతుందని ఆ సంస్థ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మాధురి మరాతే తెలిపారు. గర్భిణులుగా ఉన్నప్పటి నుంచి ప్రారంభించి పిల్లలు పుట్టి వారికి రెండేళ్లు వచ్చే వరకూ ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. గైనకాలజిస్టులు, ఆయుర్వేదిక్‌ వైద్యులు, యోగా శిక్షకులతో కలిసి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెద్దాసుపత్రికి గుండెపోటు

ర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన నాగార్జునకు 34 ఏళ్లు.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో చేరారు. పరీక్షలు చేయగా గుండెపోటు అని వైద్యులు నిర్ధారించారు. కార్డియాలజీ విభాగం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు నగరానికి చెందిన 27 ఏళ్ల లోకేశ్‌ గత నెలలో గుండెనొప్పి రావడంతో కార్డియాలజీ విభాగంలో చేరి వైద్యం పొందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వారి వ్యూహం... వీరి సహకారం!

‘సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపురం టవర్‌క్లాక్‌ దగ్గరికి వస్తా.. అక్కడి నుంచి రాప్తాడు సర్కిల్‌ వస్తా.. రామగిరి మండలం వస్తా.. లేదంటే మా గుంటూరోడు మొద్దుశీను.. పరిటాల రవిని చంపిన పార్టీ కార్యాలయం వద్దకు వస్తా. ఎవడైనా ఉంటే అక్కడికి రండి చూసుకుందాం’ అంటూ గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు హరికృష్ణారెడ్డి సవాల్‌ విసురుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఈక్రమంలో అతడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నవీన్ హత్య కేసు.. ఏ3గా నిహారిక

8. ఎన్నాళ్లీ అవస్థలు?

కృష్ణా జిల్లా గన్నవరం.. అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం.. దేశ, విదేశాల నుంచి ఇక్కడకు రోజూ అనేక విమానాలు వస్తుంటాయి. కానీ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న జక్కులనెక్కలం గ్రామస్థులు మాత్రం ఎక్కడో మారుమూల కుగ్రామంలో మాదిరిగా రోజూ బల్లకట్టుపై ఆపసోసాలు పడి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ గ్రామానికి, పొలాలకు మధ్యన ఏలూరు కాల్వ ప్రవహిస్తోంది. రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లడానికి, ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలు పని ప్రదేశాలకు వెళ్లడానికి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయ్‌!

గత ప్రభుత్వంలో పనులపై శీతకన్ను డివిజన్‌ కేంద్రం నర్సీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రూ.2.70 కోట్ల అంచనాతో కార్పొరేట్‌ స్థాయి అతిథి భవనాల నిర్మాణ పనులకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి హోం మంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణ పనులు మొదలుపెట్టి గోతులు తవ్వుతుండగా గట్టి రాయి పడింది. దీంతో పనులు ముందుకు సాగలేదు. ఈలోగా ఎన్నికలు రావడంతో వీటికి బ్రేక్‌ పడింది. తరువాత ప్రభుత్వం మారడంతో ఈ పనులు నిలిచిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అవి చెల్లని చీటీలే

గతేడాది మార్చి నుంచి డిసెంబరు మధ్య జారీ అయిన 31,454 ధ్రువపత్రాలను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. అందులో 27,328 జనన, 4126 మరణ ధ్రువపత్రాలు ఉన్నాయి. వాటన్నింటి వివరాలను సర్వర్‌ నుంచి బల్దియా తొలగించింది. ఫిబ్రవరి 13, 2023న ‘చావు.. పుట్టుకలు.. వారి చేతుల్లోనే’ అనే శీర్షికతో ‘ఈనాడు’ ప్రచురించిన కథనానికి స్పందనగా జీహెచ్‌ఎంసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. గతేడాది ప్రారంభంలో బల్దియా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ సేవల్లో లోపాలతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు వేలాదిగా మంజూరయ్యాయనే కథనంతో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని