Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Jul 2023 09:08 IST

1. మారితేనే.. మనుగడ

సీపీ గుర్నానీ.. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టెక్‌ మహీంద్రాకి సీఈవో. అత్యధిక వేతనం అందుకుంటున్న వాళ్లలో ఒకరు. పలు వేదికలపై, పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిన స్ఫూర్తిదాయక మాటలివి. ఎప్పుడైతే మనలో నేర్చుకోవడం ఆగిపోతుందో.. అప్పుడే మన పురోగతికి అడ్డుకట్ట పడుతుంది. గతంలో యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆకలి చావులు, ఆర్థిక మాంద్యాల్లాంటి ఎన్నో చవిచూశాం. వాటన్నింటినీ తట్టుకొని నిలబడేలా మన పూర్వీకులు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ప్రత్యామ్నాయాలు కనిపెట్టారు. ఇది వ్యక్తిగత జీవితానికీ వర్తిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చిన్న వయసులోనే మధుమేహమా?

ఆహార మార్పుల వల్లనో, వాతావరణం వల్లనో చిన్న వయసులోనే చాలా మంది మహిళలు మధుమేహం పాలవుతున్నారు. దాంతో పాటు ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటన్నిటినీ అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు.. అవేంటో చదివేయండి మరి.. బీన్స్‌.. మధుమేహం ఉన్నవారికి ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. రిఫైన్డ్‌ పదార్థాలతో చేసిన ఏ వంటకాలు తిన్నా షుగర్‌ పెరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో సంక్షేమ పథకాలకు ‘ఆధార్‌’ తప్పనిసరి

రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ జారీ చేసింది. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆధార్‌ చట్టంలోని నిబంధనలను సవరించింది. ‘ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందడానికి ఆధార్‌ కచ్చితంగా అనుసంధానం చేయాలి. ఆధార్‌ లేని వారిని గుర్తించి దరఖాస్తులు తీసుకోవాలి. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి ప్రభుత్వ పథకాలు అందించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు?

 రాబోయే ఎన్నికలకు వైకాపా అభ్యర్థుల ఖరారుపై ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ వేగంగా కసరత్తు చేస్తున్నారు. వైకాపా ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో తరచూ సమీక్షిస్తున్న ఆయన శుక్రవారం కూడా క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు వారి నియోజకవర్గాల్లో ఎలా పనిచేస్తున్నారు? జనంలో వారిపై ఉన్న అభిప్రాయం ఏమిటనే అంశాలపై ఐ-ప్యాక్‌ సిద్ధం చేసిన నివేదికలను సీఎం సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెండేళ్లలో మూడు గిన్నిస్‌ రికార్డులు

చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన మల్లికార్జున మరోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. 1 నుంచి 50 వరకు అంకెలను వేగంగా టైప్‌ చేసిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి 2015లో 14.88 సెకన్లలో 1- 50 సంఖ్యలు టైప్‌ చేసి గిన్నిస్‌ రికార్డు పొందారు. దాన్ని మల్లికార్జున తిరగరాశారు. ఈయన ఈ ఏడాది జూన్‌ 11న పుంగనూరులో నిపుణుల సమక్షంలో 13.16 సెకన్లలో 50 సంఖ్యలు టైప్‌ చేశారు. ఆ వీడియోను రికార్డు చేసి లండన్‌లోని గిన్నిస్‌ రికార్డ్సు సంస్థకు పంపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పైవంతెనపై ఏం జరుగుతోంది?

పైవంతెనలపై వేగ పరిమితి బోర్డులు మాయమవుతున్నాయి. హైటెక్‌సిటీలో వంతెనలన్నింటిపైనా ఇదే పరిస్థితి. మలుపులు, వాలును పరిగణనలోకి తీసుకుని వాహనాలకు జీహెచ్‌ఎంసీ విధించిన గరిష్ఠ వేగ పరిమితి బోర్డులు కనిపించకుండాపోవడం ఆందోళన కలిగిస్తోంది. పైవంతెనలపై సర్వాధికారాలున్న జీహెచ్‌ఎంసీకి ఈ విషయమే తెలియదు. నగరంలో లక్ష సీసీకెమెరాలు ఏర్పాటుచేసి చీమ చిటుక్కుమన్నా తెలుస్తోందనే ట్రాఫిక్‌ పోలీసులూ మాకేం తెలుసంటున్నారు. ఈ తీరుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రైలెక్కాలంటేనే భయమేస్తోంది

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన దృశ్యాలు ప్రయాణికులను కలచి వేశాయి. హెల్ప్‌ డెస్కు వద్దకు వచ్చి ప్రయాణికులు, వారి సంబంధీకులు విచారించడం, కొన్ని రైళ్ల దారి మళ్లింపు, రద్దుతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో గందరగోళం ఏర్పడింది. ప్రమాదంలో కాలిపోయిన బోగీలను అక్కడే వదిలేసి.. మిగతా 11 బోగీలతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మారిన యువత అభిరుచి

సెల్‌ఫోన్‌ తీసుకుని.. యాప్‌పై క్లిక్‌ చేసి.. అలా ఆర్డర్‌ ఇవ్వగానే.. ఇలా కొన్ని నిమిషాల్లోనే రుచికరమైన వంటకాలు ఇంటికొచ్చేస్తున్నాయి. ఇలా రోజుకు వేలాది ఆర్డర్లు.. ఆన్‌లైన్‌లో ఆహారాన్ని కొనుగోలు చేసే ఒరవడి చెన్నై నగరంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ రంగంవైపు మొగ్గి ఉద్యోగాలు చేసేవారి సంఖ్య ఎక్కువైంది. తాజా సర్వేలోనూ ఇదే వెల్లడైంది. దేశంలోనే ఇప్పుడు చెన్నై నగరం ఈ రంగంలో దూసుకెళ్తుందనే చెప్పాలి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎమ్మెల్యే X సర్పంచి

మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషాకు స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటు మదనపల్లె పురపాలక సంఘంలో, అటు గ్రామ పంచాయతీల్లోని ప్రజాప్రతినిధులు ఆయన తీరును విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లెలో శుక్రవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్‌ బాషా, సర్పంచి బుడ్డయ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దుబ్బిగానిపల్లెలో సర్పంచి బుడ్డయ్య అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అందమే ఆమ్మడి శక్తియుక్తి

మోడల్‌గా మొదలుపెట్టి..  ‘లుట్‌ గయే..’తో కుర్రకారు హృదయాలను లూటీ చేసి.. ఇప్పుడు ‘రంగబలి’తో టాలీవుడ్‌లో పాగా వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న భామ యుక్తి తరేజా. తన ఫటాఫట్‌ కబుర్లు ఇవి. నేపథ్యం: యుక్తి సొంతూరు హరియాణాలోని కర్నాల్‌. వ్యాపార కుటుంబం. చదువు, ఆటలు, కళలు.. అన్నింట్లోనూ ఫస్టే. కూతురు బాగా చదివి ఏ డాక్టరో, ఇంజినీరో కావాలనుకున్నారు. దానికి భిన్నంగా ఆమె తళుకుల ప్రపంచంలోకి వచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు