Yukti Thareja: అందమే అమ్మడి శక్తియుక్తి

యుక్తి సొంతూరు హరియాణాలోని కర్నాల్‌. వ్యాపార కుటుంబం. చదువు, ఆటలు, కళలు.. అన్నింట్లోనూ ఫస్టే. కూతురు బాగా చదివి ఏ డాక్టరో, ఇంజినీరో కావాలనుకున్నారు.

Updated : 09 Jul 2023 01:37 IST

మోడల్‌గా మొదలుపెట్టి..  ‘లుట్‌ గయే..’తో కుర్రకారు హృదయాలను లూటీ చేసి.. ఇప్పుడు ‘రంగబలి’తో టాలీవుడ్‌లో పాగా వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న భామ యుక్తి తరేజా. తన ఫటాఫట్‌ కబుర్లు ఇవి.
నేపథ్యం: యుక్తి సొంతూరు హరియాణాలోని కర్నాల్‌. వ్యాపార కుటుంబం. చదువు, ఆటలు, కళలు.. అన్నింట్లోనూ ఫస్టే. కూతురు బాగా చదివి ఏ డాక్టరో, ఇంజినీరో కావాలనుకున్నారు. దానికి భిన్నంగా ఆమె తళుకుల ప్రపంచంలోకి వచ్చింది.
కాలేజీ మలుపు: డిగ్రీ కోసం దిల్లీలోని శ్రీ గురు గోబింద్‌సింగ్‌ కాలేజీలో అడుగుపెట్టింది యుక్తి. అదే తన కెరియర్‌కి టర్నింగ్‌ పాయింట్‌. కాలేజీలో ఉండగానే దిల్లీ టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌గా ఎంపికైంది. చివరి సంవత్సరంలో చదువు ఆపి మరీ ఎంటీవీ సూపర్‌ మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పోటీలకు వెళ్లి గెలిచింది.
కన్నవాళ్లను ఒప్పించి: యుక్తి పలు అవార్డులు గెలవడంతో మోడలింగ్‌ అవకాశాలొచ్చాయి. కన్నవాళ్లకు అది ఇష్టం లేదు. వాళ్లని ఒప్పించడానికి ఓసారి మోడలింగ్‌ షూట్‌కి తీస్కెళ్లింది. అక్కడి పరిస్థితులకు సంతృప్తి చెందాకే వాళ్లు ఓకే చెప్పారు.
వాణిజ్య ప్రకటనల్లో: డిగ్రీ పూర్తవకముందే చాలా వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. లక్స్‌ కోజి, మలబార్‌ గోల్డ్‌, గ్రోఫర్స్‌, హాల్‌మార్క్‌ సూట్స్‌.. ఇలా ఎన్నో కమర్షియల్‌ యాడ్స్‌లో పలువురు బాలీవుడ్‌ హీరోలతో కలిసి నటించింది యుక్తి.
వీడియో సాంగ్‌: ఒకవైపు యాడ్స్‌ చేస్తూనే.. ‘ఇక్‌ సప్నా’ అనే వీడియో సాంగ్‌తో తెరంగేట్రం చేసింది. తర్వాత ఇమ్రాన్‌ హష్మీతో ‘లుట్‌ గయే.. ’ అనే ఒక వీడియో సాంగ్‌ చేసింది. ఇది పలు రికార్డులు కొల్లగొట్టింది. యూట్యూబ్‌లో దీన్ని 130 కోట్ల మంది వీక్షించారు.
టాలీవుడ్‌కి: లుట్‌ గయే.. వీడియో ద్వారానే దర్శకుడి కంట్లో పడింది. మెప్పించే నటన ప్రదర్శించడంతో ‘రంగబలి’లోని సహజ పాత్రకి ఎంపిక చేశారు. దానికోసం మరోసారి ఆడిషన్‌ చేశారు.
* కలిసి డ్యాన్స్‌ చేయాలనుకునేది:  అల్లు అర్జున్‌
* అభిమాన దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి
* నటి కాకపోయుంటే: ఇంటీరియర్‌ డిజైనర్‌
* ఆరాధించే నటి: అనుష్క శర్మ
* ఒకే ఒక ఆశ: ప్రపంచమంతా చుట్టిరావడం
* ఇష్టపడే నటుడు: రణ్‌వీర్‌సింగ్‌
* తీరికగా ఉన్నప్పుడు చూసేది: బాక్సింగ్‌
* ఇష్టంగా తినేది: అన్నం, పప్పు
* టాటూల అభిమాని: ఒంటిపై మూడు టాటూలున్నాయి
* ఇన్‌స్టాలో అనుసరిస్తోంది: 7లక్షల మంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని