మారితేనే.. మనుగడ

సీపీ గుర్నానీ.. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టెక్‌ మహీంద్రాకి సీఈవో. అత్యధిక వేతనం అందుకుంటున్న వాళ్లలో ఒకరు

Published : 08 Jul 2023 00:55 IST

స్ఫూర్తి పాఠం

సీపీ గుర్నానీ.. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టెక్‌ మహీంద్రాకి సీఈవో. అత్యధిక వేతనం అందుకుంటున్న వాళ్లలో ఒకరు. పలు వేదికలపై, పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిన స్ఫూర్తిదాయక మాటలివి.

* ఎప్పుడైతే మనలో నేర్చుకోవడం ఆగిపోతుందో.. అప్పుడే మన పురోగతికి అడ్డుకట్ట పడుతుంది. గతంలో యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆకలి చావులు, ఆర్థిక మాంద్యాల్లాంటి ఎన్నో చవిచూశాం. వాటన్నింటినీ తట్టుకొని నిలబడేలా మన పూర్వీకులు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ప్రత్యామ్నాయాలు కనిపెట్టారు. ఇది వ్యక్తిగత జీవితానికీ వర్తిస్తుంది.
* మనం ఉదయం నిద్ర లేవగానే.. ‘అయ్యో.. ఈరోజు కూడా ఆఫీసుకి వెళ్లాలా? అని ఫీలయ్యే పరిస్థితులు ఉంటే ఆ ఉద్యోగం వదిలేయడమే మంచిది. చేసే పని స్ఫురణలోకి రాగానే ఉత్సాహంగా, ఛాలెంజింగ్‌గా ఉందని భావించినప్పుడే.. మీరు సరైన వాతావరణంలో పని చేస్తున్నట్టు లెక్క.

* డిగ్రీ పట్టా అందగానే కొన్ని రకాల ఉద్యోగాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోవడానికి నాలుగేళ్ల సమయం తీసుకున్నా. ఎంతో ఆలోచించి, అధ్యయనం చేసి చివరికి టెక్నాలజీ కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉందనే నిర్ణయానికొచ్చా. అప్పట్నుంచి కెరియర్‌లో ‘అయ్యో.. అనసవరంగా ఈ రంగంలోకి వచ్చానే’ అనుకున్న రోజు
ఒక్కటీ లేదు.
* ప్రపంచం ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు లోనవుతోంది. నిన్నటి టెక్నాలజీ ఈరోజు పాత బడిపోతోంది. కెరియర్‌లో ఎదగాలనుకున్నవారు ఎప్పటికప్పుడు ఆ మార్పులు గమనించాలి. కొత్త నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. పోటీలో నిలవాలంటే ఎప్పటికప్పుడు మెరుగుపడాల్సిందే.
* నలుగురిలో ఒక్కడిలా ఉండాలా? నలుగురు మెచ్చేలా ఉండాలా.. అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. చొరవ, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్లే త్వరత్వరగా పదోన్నతుల నిచ్చెనలు ఎక్కుతారు. కష్టపడేవారికి ఒక్కోసారి గుర్తింపు ఆలస్యంగా రావొచ్చు. గుర్తింపు దక్కడం మాత్రం తథ్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని