ఏపీలో సంక్షేమ పథకాలకు ‘ఆధార్‌’ తప్పనిసరి

రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ జారీ చేసింది.

Updated : 08 Jul 2023 07:54 IST

గెజిట్‌ జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ జారీ చేసింది. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆధార్‌ చట్టంలోని నిబంధనలను సవరించింది. ‘ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందడానికి ఆధార్‌ కచ్చితంగా అనుసంధానం చేయాలి. ఆధార్‌ లేని వారిని గుర్తించి దరఖాస్తులు తీసుకోవాలి. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి ప్రభుత్వ పథకాలు అందించాలి. ఆధార్‌ లేదన్న కారణాన్ని చూపి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పథకాలు తిరస్కరించకూడదు. దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ఆధార్‌ నంబరు కేటాయించి, వారికి అందే పథకాలకు అనుసంధానం చేయాలి’ అని ప్రభుత్వం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని