చిన్న వయసులోనే మధుమేహమా?

ఆహార మార్పుల వల్లనో, వాతావరణం వల్లనో చిన్న వయసులోనే చాలా మంది మహిళలు మధుమేహం పాలవుతున్నారు. దాంతో పాటు ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి.

Published : 08 Jul 2023 00:18 IST

ఆహార మార్పుల వల్లనో, వాతావరణం వల్లనో చిన్న వయసులోనే చాలా మంది మహిళలు మధుమేహం పాలవుతున్నారు. దాంతో పాటు ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటన్నిటినీ అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు.. అవేంటో చదివేయండి మరి..

బీన్స్‌.. మధుమేహం ఉన్నవారికి ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. రిఫైన్డ్‌ పదార్థాలతో చేసిన ఏ వంటకాలు తిన్నా షుగర్‌ పెరుగుతుంది. భోజనంలో భాగంగా బీన్స్‌ తీసుకుంటే దీనిలో ఉన్న పీచు వల్ల కడుపునిండినట్టుగా అనిపిస్తుంది. తొందరగా ఆకలి వేయదు.

బచ్చలి కూర.. ఏ కాలంలోనైనా దొరుకుతుంది. డైటరీ ఫైబర్స్‌, విటమిన్లు, క్లోరోఫిల్‌, క్యాల్షియం, జింక్‌ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. బచ్చలికూర రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను నియంత్రిస్తుంది.

గోధుమలు..  చపాతీలు తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. దాంట్లో కూడా ప్రాసెస్‌ చేసిన మైదా పదార్థాలు తినకూడదు. ఇవీ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. కాబట్టి పూర్తి పొట్టుతో ఉన్న గోధుమ పిండితో చేసిన చపాతీలు, పుల్కాలు, రొట్టెలు తినొచ్చు.

వెల్లుల్లి.. దాల్చినచెక్కను రోజూ ఉదయాన్నే టీలో వేసుకొని తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లి ఉపయోగించటం వల్ల రక్తంలో ఇన్సులిన్‌ స్థాయి పెరుగుతుంది. అది రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని