Guinness World Record: రెండేళ్లలో మూడు గిన్నిస్‌ రికార్డులు

చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన మల్లికార్జున మరోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. 1 నుంచి 50 వరకు అంకెలను వేగంగా టైప్‌ చేసిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు.

Updated : 08 Jul 2023 08:47 IST

అంకెలు టైప్‌ చేస్తున్న మల్లికార్జున

సదుం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన మల్లికార్జున మరోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. 1 నుంచి 50 వరకు అంకెలను వేగంగా టైప్‌ చేసిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి 2015లో 14.88 సెకన్లలో 1- 50 సంఖ్యలు టైప్‌ చేసి గిన్నిస్‌ రికార్డు పొందారు. దాన్ని మల్లికార్జున తిరగరాశారు. ఈయన ఈ ఏడాది జూన్‌ 11న పుంగనూరులో నిపుణుల సమక్షంలో 13.16 సెకన్లలో 50 సంఖ్యలు టైప్‌ చేశారు. ఆ వీడియోను రికార్డు చేసి లండన్‌లోని గిన్నిస్‌ రికార్డ్సు సంస్థకు పంపారు. వారు దానిని సమీక్షించి కొత్త రికార్డుగా గుర్తించి మల్లికార్జునకు తాజాగా ప్రశంసాపత్రాన్ని పంపించారు. అంతే కాకుండా మల్లికార్జున టైపింగ్‌ చేస్తున్న వీడియోను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో సంస్థ పోస్టు చేసింది. 2022లో యోగాలో అష్టవక్రాసనం, 2023లో ఎక్కువ దేశాల కాలింగ్‌ కోడ్లు గుర్తించడంలో మల్లికార్జున రికార్డులు సాధించారు. దీంతో ఆయన రెండేళ్ల వ్యవధిలో మూడు వరల్డ్‌ రికార్డులు సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

గిన్నిస్‌ రికార్డు సాధించినట్లు అందిన పత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని