Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jul 2023 09:11 IST

1. బాబోయ్‌.. ఇవేం రహదారులు!

అధ్వాన రహదారులతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరుస వర్షాలతో రోడ్డుపై గోతుల్లో నీరు చేసి ప్రయాణం సాహసంగా మారుతోంది. గొయ్యిలు, గతుకులమయం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టించుకునే వారు కరవైపోయారని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి, గజపతినగరం, రాజాం నియోజకవర్గాల్లో  ఎక్కడికక్కడ గోతుల్లో నీరుచేరి, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మహిళా మార్టులు ఎక్కడండి?

స్వయం సహాయక సంఘాల మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఏడాది కావస్తున్నా జిల్లాలో ఒక చోట తప్ప ఇతర మండలంలో మార్టులు ఏర్పాటు కాలేదు. మండలానికి ఒకటన్నది చివరకు... జిల్లాకు కనీసం మరో మూడైనా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినా ఆ దిశగా అడుగులు కూడా పడటంలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డిజి లాకర్‌లో పత్రాలుంటే.. ఒరిజినల్స్‌ అవసరం లేదు

డిజి లాకర్‌లో ధ్రువపత్రాలున్నాయా...? అయితే పాస్‌పోర్టు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ సులభమైనట్టే.. అపాయింట్‌మెంట్‌ ఉన్న రోజున వెళ్లి ఓ ఫొటో దిగొస్తే చాలు. తదుపరి ప్రక్రియ పూర్తయిన కొద్దిరోజుల్లో పాస్‌పోర్టు మీ చేతికొస్తుంది. భౌతికంగా ధ్రువపత్రాలు అందించడంలో ఎదురయ్యే సమస్యలకు చెక్‌ పెడుతూ విదేశాంగశాఖ డిజి లాకర్‌ ద్వారా పత్రాల అప్‌లోడింగ్‌కు అనుమతించింది. దీంతోపాటు ఈ-ఆధార్‌కూ అనుమతి లభించిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య శుక్రవారం తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగనన్నా.. ఎలా అడుగు పెట్టాలన్నా?

జిల్లాలో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెండున్నరేళ్లుగా అంతర్గత రహదారుల నిర్మాణ విషయాన్ని పట్టించుకోలేదు. పేద లబ్ధిదారుల గొంతుపై కత్తి పెట్టి ఇళ్ల నిర్మాణం చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చిన వైకాపా పాలకులు కనీస వసతుల కల్పనలో ఘోరంగా విఫలమయ్యారు. రోడ్ల నిర్మాణానికి రూ.70 కోట్లకుపైగా నిధులు కావాల్సి ఉండగా రూపాయి విడుదల చేయలేదు. మూడ్రోజులుగా కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలు తటాకాల్లాగా మారిపోయాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విద్యార్థినుల సైకిళ్లకూ వైకాపా రంగులేనా?

 వంతెనలు, వివిధ భవనాలు, తాగునీటి పథకాలకే ఇన్నాళ్లూ పరిమితమైన వైకాపా జెండా రంగులు.. ఇప్పుడు విద్యార్థినుల సైకిళ్లపైనా కనిపిస్తున్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు అరబిందో ఫార్మా కంపెనీ తన ఫౌండేషన్‌ ద్వారా సుమారు రూ.1.75 కోట్లతో 2500 సైకిళ్ల పంపిణీకి ముందుకు వచ్చింది. ఇదే అదనుగా భావించి సైకిళ్లకు పార్టీ రంగులు వేసేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆగస్టు 1న కొత్త పింఛన్లు లేనట్లే!

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురుకానుంది. ఆరు నెలలకోసారి(జులై, జనవరి) కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామన్న జగన్‌ ప్రభుత్వ ఆర్భాటపు ప్రకటన మళ్లీ మడతపడనుంది. ఆగస్టు 1వ తేదీన ప్రారంభమయ్యే పంపిణీలోనూ వారికి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి జులై 1వ తేదీనే కొత్త పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ అందించలేదు. ఆగస్టు 1వ తేదీనైనా ఇస్తారని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొత్త వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటా పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే

రాష్ట్రంలో 2014 జూన్‌ 2వ తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలోని మొత్తం పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర విద్యార్థులకు 117 సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇదీ భర్తీ విధానం: మెడికల్‌ పీజీలో తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో 50 శాతం సీట్లు ఆలిండియా కోటా కింద జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లో భర్తీ కానుండగా..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చిర్రెత్తి.. సిద్ధూ కారుకే అడ్డుపెట్టాడాయన!

ప్రముఖులు తమ ఇంటి పక్కన ఉంటే బాగుంటుందని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది సమస్యలూ తెచ్చిపెడుతుంది. బెంగళూరు కుమారకృప రహదారిలోని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి పక్కనే ఉంటున్న పురుషోత్తమ్‌కు ఇలాంటి సమస్యే ఎదురైంది. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చే ప్రముఖులు, పోలీసులు అందరూ తన ఇంటి ముందు కార్లు, వాహనాలను నిలపడం ఆయనకు చికాకు కలిగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒక్కో పరీక్ష ఒక్కోచోట!.. ఆందోళనలో గురుకుల టీచర్‌ అభ్యర్థులు

గురుకులాల్లో టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు పేపర్‌-1, 2, 3లలో ఒక్కో పేపర్‌కు వేర్వేరు జిల్లాల్లో ఒక్కో పరీక్ష కేంద్రాన్ని కేటాయించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకరోజు ఒక పేపర్‌ పరీక్ష రాసిన అభ్యర్థి ఆ మరుసటి రోజునే వందల కిలోమీటర్ల దూరంలోని మరో పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లగలరని ప్రశ్నిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 90 నిమిషాలు ముందే వచ్చి.. 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు!

వేర్వేరు కారణాల వల్ల రైళ్లు ఆలస్యం కావడం పరిపాటి అయినా వాస్కోడగామా- హజ్రత్‌ నిజాముద్దీన్‌ గోవా ఎక్స్‌ప్రెస్‌ 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురిచేసింది. గురువారం ఉదయం  10.35 గంటలకు ఈ రైలు మహారాష్ట్రలోని మన్మాడ్‌ జంక్షన్‌కు రావాల్సి ఉండగా మళ్లింపు మార్గంలో 9.05కే వచ్చేసింది. అప్పటికి ఇంకా ఆ స్టేషన్‌కు చేరుకోవాల్సినవారు ఉన్నా ఐదు నిమిషాల్లోనే అక్కడి నుంచి బయల్దేరివెళ్లిపోయింది. ఆ స్టేషన్లో 45 మంది ఆ రైలును అందుకోవాల్సి ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని