Siddaramaiah: చిర్రెత్తి.. సిద్ధూ కారుకే అడ్డుపెట్టాడాయన!

ప్రముఖులు తమ ఇంటి పక్కన ఉంటే బాగుంటుందని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది సమస్యలూ తెచ్చిపెడుతుంది.

Updated : 29 Jul 2023 08:14 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ప్రముఖులు తమ ఇంటి పక్కన ఉంటే బాగుంటుందని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది సమస్యలూ తెచ్చిపెడుతుంది. బెంగళూరు కుమారకృప రహదారిలోని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి పక్కనే ఉంటున్న పురుషోత్తమ్‌కు ఇలాంటి సమస్యే ఎదురైంది. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చే ప్రముఖులు, పోలీసులు అందరూ తన ఇంటి ముందు కార్లు, వాహనాలను నిలపడం ఆయనకు చికాకు కలిగించింది. తన కారును ఇంటి నుంచి బయటకు తీసేందుకు కూడా ఇబ్బంది ఎదురవుతోందని చిర్రెత్తుకొచ్చిన పురుషోత్తమ్‌.. గురువారం సీఎం బయటకు వెళ్లే సమయాన్ని చూసుకుని ఆయన కాన్వాయికి అడ్డుగా తన వాహనాన్ని ఉంచారు. దాన్ని పక్కకు తీయాలని భద్రతా సిబ్బంది చెప్పినా వినలేదు. చివరకు ముఖ్యమంత్రి పురుషోత్తమ్‌ను పిలిపించుకుని.. మరోసారి ఇటువంటి సమస్య రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ తర్వాతే ఆయన తన వాహనాన్ని అడ్డు తీశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని