YSRCP: విద్యార్థినుల సైకిళ్లకూ వైకాపా రంగులేనా?

వంతెనలు, వివిధ భవనాలు, తాగునీటి పథకాలకే ఇన్నాళ్లూ పరిమితమైన వైకాపా జెండా రంగులు.. ఇప్పుడు విద్యార్థినుల సైకిళ్లపైనా కనిపిస్తున్నాయి.

Updated : 29 Jul 2023 08:58 IST

అనకాపల్లి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: వంతెనలు, వివిధ భవనాలు, తాగునీటి పథకాలకే ఇన్నాళ్లూ పరిమితమైన వైకాపా జెండా రంగులు.. ఇప్పుడు విద్యార్థినుల సైకిళ్లపైనా కనిపిస్తున్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు అరబిందో ఫార్మా కంపెనీ తన ఫౌండేషన్‌ ద్వారా సుమారు రూ.1.75 కోట్లతో 2500 సైకిళ్ల పంపిణీకి ముందుకు వచ్చింది. ఇదే అదనుగా భావించి సైకిళ్లకు పార్టీ రంగులు వేసేశారు. వీటిని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, అరబిందో ఫార్మా ఎండీ నిత్యానందరెడ్డి విద్యార్థినులకు శనివారం అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని