Train: 90 నిమిషాలు ముందే వచ్చి.. 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు!

వేర్వేరు కారణాల వల్ల రైళ్లు ఆలస్యం కావడం పరిపాటి అయినా వాస్కోడగామా- హజ్రత్‌ నిజాముద్దీన్‌ గోవా ఎక్స్‌ప్రెస్‌ 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురిచేసింది.

Updated : 29 Jul 2023 08:17 IST

ముంబయి: వేర్వేరు కారణాల వల్ల రైళ్లు ఆలస్యం కావడం పరిపాటి అయినా వాస్కోడగామా- హజ్రత్‌ నిజాముద్దీన్‌ గోవా ఎక్స్‌ప్రెస్‌ 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురిచేసింది. గురువారం ఉదయం  10.35 గంటలకు ఈ రైలు మహారాష్ట్రలోని మన్మాడ్‌ జంక్షన్‌కు రావాల్సి ఉండగా మళ్లింపు మార్గంలో 9.05కే వచ్చేసింది. అప్పటికి ఇంకా ఆ స్టేషన్‌కు చేరుకోవాల్సినవారు ఉన్నా ఐదు నిమిషాల్లోనే అక్కడి నుంచి బయల్దేరివెళ్లిపోయింది. ఆ స్టేషన్లో 45 మంది ఆ రైలును అందుకోవాల్సి ఉంది. 9.45-10 గంటల సమయంలో స్టేషన్‌కు వచ్చిన ఆ ప్రయాణికులు అసలు విషయం తెలిసి విస్తుబోయారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ స్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అధికారులు వీరి కోసం గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్‌లో నిలుపుచేయించి, దానిలో జల్గావ్‌కు పంపించారు. వారు వచ్చేవరకు గోవా ఎక్స్‌ప్రెస్‌ను అక్కడ ఆపేశారు. దీంతో కథ సుఖాంతమైంది. ఈ పరిణామం రైల్వే సిబ్బంది పొరపాటు అని, దీనిపై విచారణ ప్రారంభించామని మధ్య రైల్వే ఉన్నతాధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు