Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Aug 2023 09:16 IST

1. అందరి చూపు.. కంప్యూటర్‌ సైన్స్‌వైపే..

ఇంజినీరింగ్‌ కళాశాలలో సీట్ల ఎంపిక 7 నుంచి ప్రారంభం కానుండగా విద్యార్థి తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. మెజారిటీ విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకు సమీపంలో నాలుగైదు కళాశాలలను ఇప్పటికే చూసుకొని, వాటిలో ఈ కోర్సులో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇంజినీరింగ్‌ సీట్లకు సంబంధించి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దాన్ని సాంకేతిక విద్యాశాఖ మార్పు చేసింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగనన్నా.. ఇదెక్కడి న్యాయం?

వంశధార రిజర్వాయర్‌ పనులను రూ.1,624 కోట్ల వ్యయంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. 18 ఏళ్లుగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడు హిరమండలంలోని 13 గ్రామాలు, కొత్తూరులో 5, ఎల్‌ఎన్‌పేటలో 1 మొత్తం 19 గ్రామాలకు చెందిన సుమారు పది వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారారు. అప్పట్లో వీరికి పునరావాసం, పునర్నిర్మాణం(ఆర్‌అండ్‌ఆర్‌) ద్వారా ఎకరాకు రూ.1.30 లక్షల చొప్పున పరిహారంఅందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎందుకీ జాప్యం ఏమిటీ మౌనం..?

ఎటువంటి ఆధారాలు లభించని నేరాల్లో సైతం నిందితులను రోజులు, గంటల వ్యవధిలోనే జిల్లా పోలీస్‌ శాఖ పట్టుకున్న సంఘటనలున్నాయి. విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల నిందితులు సునాయాసంగా పట్టుబడుతున్నారు. అలాంటిది స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించే కొన్ని హత్యల విషయంలో నిందితులు పట్టుబడకపోవడం చర్చకు తావిచ్చేలా చేస్తోంది. ప్రధానంగా ఆర్థికంగా, రాజకీయంగా పట్టున్న కుటుంబాల్లో హత్యలకు సంబంధించిన దర్యాప్తు తీరుపై విశ్వసనీయత కోల్పోయేలా కొన్ని ఉదంతాలు నిలుస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూ.2 లంచం .. 37 ఏళ్లు విచారణ..

వాహనదారుల నుంచి అక్రమంగా రూ.2 వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసులు.. 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నిర్దోషులుగా తేలారు. 1986లో నమోదైన ఈ కేసులో బిహార్‌లోని ఓ కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో రామరతన్‌ శర్మ, కైలాష్‌ శర్మ, జ్ఞాని శంకర్‌, యుగేశ్వర్‌ మహ్తో, రామ్‌ బాలక్‌ రాయ్‌ అనే ఐదుగురు పోలీసులపై నమోదైన కేసును కొట్టివేసింది. ఆ కేసు వివరాలివీ..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘రూసా’కూ సర్కారు దెబ్బ!

ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి నిలపడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇస్తున్న రూసా నిధులను సైతం ఇతర అవసరాలకు వాడేసుకుంటోంది. నిధులు ఖర్చు చేసి ధ్రువపత్రాలు ఇస్తే మిగిలిన వాటిని విడుదల చేస్తామని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చివరకు గుత్తేదార్లు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కితేగాని చెల్లించని దుస్థితి. న్యాయస్థానం ఆదేశాలతో ఇటీవల గుత్తేదార్లకు ప్రభుత్వం రూ.48 కోట్లు విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాహుల్‌ ఇంటికి అరుదైన కుక్కపిల్లలు

గోవా పర్యటనలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రెండు కుక్కపిల్లలను కొనుగోలు చేశారు. షేడ్స్‌ కెన్నెల్‌ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్శించిన ఆయన అక్కడ జాక్‌ రస్సెల్‌ టెర్రియర్‌ జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్క పిల్లలను తీసుకున్నారు. వీటి కోసమే ఆయన గోవా వచ్చినట్లు సమాచారం. వాటిని కొనుగోలు చేసిన తర్వాత విమానయాన నిబంధనల కారణంగా ఒక కుక్క పిల్లనే తనతో దిల్లీ తీసుకెళ్లినట్లు తెలిసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డ్రైవర్‌ నుంచి ఎమ్మెల్సీ అయ్యాను

శాసన మండలి సమావేశాల్లో గురువారం వర్షాలపై నిర్వహించిన చర్చలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీని. మొదటిసారి మాట్లాడుతున్నా. చాలా చిన్నవాణ్ని. డ్రైవర్‌గా పనిచేసేవాడిని. దీన్ని ఒప్పుకోవడం పెద్ద విషయమేమీ కాదు. అల్లా నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేనేదో పెద్దవాడిని అయ్యానని భావించను. ప్రజల మనిషిని. వారితో కలిసి ఉంటాను.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హైదరాబాద్‌ యూటీగా మారే రోజు ఎంతో దూరంలో లేదు

హైదరాబాద్‌, బెంగళూర్‌, చెన్నై, ముంబయి కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ)గా మారే రోజులు ఎంతో దూరంలో లేవని అన్ని ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ‘దిల్లీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. దిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కోసం అటల్‌బిహారీ వాజ్‌పేయీ ఈ సభలో బిల్లును ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనాలో పిల్లలకు రోజుకు 2 గంటలే ఫోన్‌.. రాత్రిపూట ఇంటర్నెట్‌ బంద్‌

చైనా చిన్నారులు ఇంటర్నెట్‌కు బానిసలుగా మారిపోయారని జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే తీసుకున్న అనేక చర్యలకు కొనసాగింపుగా తాజా నిబంధనలు రూపొందించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకునే విషయంలో చైనాలో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. చిన్నారులు పగటిపూట ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకే పరిమితం చేస్తూ 2019లో ఆంక్షలు విధించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆకర్షణీయమైన లాభాల కోసం..

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘మిరే అసెట్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌’ను తీసుకొచ్చింది. ఇది లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో మదుపు చేసే ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 11తో ముగుస్తుంది. అంకిత్‌ జైన్‌ ఫండ్‌ మేనేజర్‌. నిఫ్టీ మల్టీ క్యాప్‌ 50:25:25 టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 మదుపు చేయాలి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని