రాహుల్‌ ఇంటికి అరుదైన కుక్కపిల్లలు

గోవా పర్యటనలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రెండు కుక్కపిల్లలను కొనుగోలు చేశారు. షేడ్స్‌ కెన్నెల్‌ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్శించిన ఆయన అక్కడ జాక్‌ రస్సెల్‌ టెర్రియర్‌ జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్క పిల్లలను తీసుకున్నారు.

Updated : 04 Aug 2023 06:09 IST

పనాజీ: గోవా పర్యటనలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రెండు కుక్కపిల్లలను కొనుగోలు చేశారు. షేడ్స్‌ కెన్నెల్‌ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్శించిన ఆయన అక్కడ జాక్‌ రస్సెల్‌ టెర్రియర్‌ జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్క పిల్లలను తీసుకున్నారు. వీటి కోసమే ఆయన గోవా వచ్చినట్లు సమాచారం. వాటిని కొనుగోలు చేసిన తర్వాత విమానయాన నిబంధనల కారణంగా ఒక కుక్క పిల్లనే తనతో దిల్లీ తీసుకెళ్లినట్లు తెలిసింది. వ్యక్తిగత పర్యటనపైనే రాహుల్‌ గాంధీ గోవా వచ్చినా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై వారితో చర్చించారు. బుధవారం రాత్రి గోవా వచ్చిన రాహుల్‌ గురువారం ఉదయం 11 గంటలకు దిల్లీకి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని