Asaduddin Owaisi: హైదరాబాద్‌ యూటీగా మారే రోజు ఎంతో దూరంలో లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌, బెంగళూర్‌, చెన్నై, ముంబయి కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ)గా మారే రోజులు ఎంతో దూరంలో లేవని అన్ని ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

Updated : 04 Aug 2023 09:26 IST

హైదరాబాద్‌, బెంగళూర్‌, చెన్నై, ముంబయి కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ)గా మారే రోజులు ఎంతో దూరంలో లేవని అన్ని ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ‘దిల్లీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. దిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కోసం అటల్‌బిహారీ వాజ్‌పేయీ ఈ సభలో బిల్లును ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ద్వారా గౌరవసభ హోదాను ఈ ప్రభుత్వం కించపరుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీ రాజకీయ పోరాటాన్ని (భాజపా, ఆప్‌) సభ వెలుపల చూసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల థింక్‌ట్యాంక్‌ నుంచే బయటకు వచ్చారని అన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వ మనిషేనని, మీరు అధికారంలో లేనప్పుడు ఆయనను ఆ స్థానంలో ఉంచాలనుకుంటున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని