Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Aug 2023 09:18 IST

1. క్లోమ క్యాన్సర్‌కు టీకా

ప్రాణాంతక క్యాన్సర్లలో క్లోమగ్రంథి (పాంక్రియాస్‌) క్యాన్సర్‌ ఒకటి. దీని బారినపడ్డవారిలో చికిత్స అనంతరం కేవలం 12% మందే ఐదేళ్ల వరకు జీవిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవటానికి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న టీకా కొంతవరకు విజయవంతం కావటం కొత్త ఆశలు రేపుతోంది. కొవిడ్‌-19కు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను రూపొందించిన బయోఎన్‌టెక్‌ కంపెనీ శాస్త్రవేత్తలు అదే పరిజ్ఞానంతో ఈ క్యాన్సర్‌ టీకానూ రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. క్రమం తప్పిన స్థలాల క్రమబద్ధీకరణ..!

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. జీవో 58 కింద దరఖాస్తుల సర్వేకే అధికారులు ప్రాధాన్యమిచ్చారని, తమవి పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. రెండో విడత సర్వేలోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. తమ స్థలాలు క్రమబద్ధీకరణ అవుతాయా.. లేదా అనే సందేహాలు వారిని వేధిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శక్తిమంతమైన దేశీయ రివాల్వర్‌ ‘ప్రబల్‌’

మన భద్రతా బలగాల చేతికి మరో కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్‌ రేంజ్‌ రివాల్వర్‌ ‘ప్రబల్‌’ ఆగస్టు 18న విడుదల కానుంది. కాన్పుర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఏడబ్ల్యూఈఐఎల్‌) సంస్థ ఈ ఆయుధాన్ని రూపొందించింది. తక్కువ బరువుండే ఈ రివాల్వర్‌తో 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్టవచ్చు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కీలకమైన ప్రాజెక్ట్‌కు సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌వో) శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్లింగ్‌ లా పాస్‌ ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఉన్న మోటారబుల్‌ రోడ్‌గా పేరు పొందింది. కొత్తగా బీఆర్‌వో చేపట్టబోయే రోడ్డు నిర్మాణం ఈ రికార్డును అధిగమిస్తుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేంద్రీయ ఆసుపత్రుల్లో.. నర్సింగ్‌ ఆఫీసర్లు

కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న ప్రముఖ ఆసుపత్రుల్లో సేవలు అందించే అవకాశం వచ్చింది. నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో విజయవంతమైతే ఆకర్షణీయ వేతనం పొందవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అఖిలభారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్‌)ల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రకటన వెలువడింది. బీఎస్సీ నర్సింగ్‌,   జీఎన్‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు అర్హులు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాట్సప్‌ వెబ్‌కీ తాళమేయండి

యాప్‌లోనే కాదు, వెబ్‌లోనూ భద్రతను పెంచటం మీద వాట్సప్‌ దృష్టి సారించింది. ఇందుకోసం కొత్త స్క్రీన్‌లాక్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సప్‌ వెబ్‌ బీటా ప్రోగ్రామ్‌లో చేరినవారికిది అందుబాటులో ఉంటుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తేనే వాట్సప్‌ వెబ్‌ అన్‌లాక్‌ అవుతుంది. ఒకవేళ పాస్‌వర్డ్‌ మరచిపోయినట్టయితే వాట్సప్‌ వెబ్‌ నుంచి లాగవుట్‌ అయ్యి, తిరిగి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పోటీ చేస్తానన్నారు.. వైకాపా నుంచే అని చెప్పలేదు: బాలినేని వ్యాఖ్యలపై చర్చ

‘వచ్చే ఎన్నికల్లో నేను, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు నుంచే పోటీ చేస్తాం’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు నగర పాలకసంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఎంపీ మాగుంటతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను నియోజకవర్గం మారుతానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గాలేరు నగరి పేరుతో దగా

గాలేరు నగరి సుజల స్రవంతి జలాల కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయి. లక్షలమంది ప్రజల దాహార్తి తీరుతుంది. వైకాపా అధికారంలోకొచ్చిన ఈ నాలుగేళ్లలో ఒక్క జలాశయ నిర్మాణాన్నీ పూర్తి చేయలేదు. ప్యాకేజీల అంచనాలు పెంచినా పనులేమీ జరగలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చిరుద్యోగుల జీతాల్ని మింగేసిన సర్కారు!

క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సిబ్బందికి ఆరునెలలకోసారి కూడా జీతాలివ్వడం లేదు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఏ జిల్లా చూసినా వందలమంది ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సకాలంలో జీతాలందక ఆకలితో అప్పులు చేసుకుంటూ సంసారాలు నెట్టుకొస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తీసుకునేది ప్రజా సొమ్ము... చేసేది వైకాపా సేవ

నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం, ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని తెలిసినా వాలంటీర్లు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడం మానట్లేదు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో కూడా తమనెవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో వారు పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం పంచాయతీ సర్పంచి స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో వైకాపా మద్దతుదారు తరఫున ఆ గ్రామ వాలంటీర్లు రంగంలోకి దిగారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని