శక్తిమంతమైన దేశీయ రివాల్వర్‌ ‘ప్రబల్‌’

మన భద్రతా బలగాల చేతికి మరో కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్‌ రేంజ్‌ రివాల్వర్‌ ‘ప్రబల్‌’ ఆగస్టు 18న విడుదల కానుంది.

Published : 16 Aug 2023 04:45 IST

కాన్పుర్‌: మన భద్రతా బలగాల చేతికి మరో కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్‌ రేంజ్‌ రివాల్వర్‌ ‘ప్రబల్‌’ ఆగస్టు 18న విడుదల కానుంది. కాన్పుర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఏడబ్ల్యూఈఐఎల్‌) సంస్థ ఈ ఆయుధాన్ని రూపొందించింది. తక్కువ బరువుండే ఈ రివాల్వర్‌తో 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్టవచ్చు. గతంలో తయారు చేసిన ఈ తరహా ఆయుధాలతో పోలిస్తే దీని పరిధి రెండు రెట్లు ఎక్కువ. ‘‘గతంలో దేశీయంగా తయారైన రివాల్వర్ల రేంజ్‌ కేవలం 20 మీటర్లు. ప్రబల్‌ 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. దీని బరువు 700 గ్రాములు. స్వీయ భద్రత కోసం మహిళలు సైతం దీన్ని సులభంగా తమతో తీసుకెళ్లొచ్చు. లైసెన్స్‌ కలిగిన సామాన్యులు కూడా ఈ ఆయుధాన్ని కొనుగోలు చేయొచ్చు’’ అని ఏడబ్ల్యూఈఐఎల్‌ డైరెక్టర్‌ ఏకే మౌర్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలోని ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ పునర్నిర్మాణంలో భాగంగా ఏడు పీఎస్‌యూలను 2021లో ఏర్పాటు చేసింది. వాటిలో ఏడబ్ల్యూఈఐఎల్‌ కూడా ఒకటి. ఈ ఒక్క ఏడాదే సంస్థ రూ.6 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆర్డర్లను సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు