ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కీలకమైన ప్రాజెక్ట్‌కు సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌వో) శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది.

Published : 16 Aug 2023 03:43 IST

తూర్పు లద్దాఖ్‌లో నిర్మాణానికి కసరత్తు 

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కీలకమైన ప్రాజెక్ట్‌కు సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌వో) శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్లింగ్‌ లా పాస్‌ ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఉన్న మోటారబుల్‌ రోడ్‌గా పేరు పొందింది. కొత్తగా బీఆర్‌వో చేపట్టబోయే రోడ్డు నిర్మాణం ఈ రికార్డును అధిగమిస్తుంది. సముద్ర మట్టం నుంచి 19,400 అడుగుల ఎత్తులో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. లికారు-మిగ్‌ లా- ఫుక్చే ప్రాంతాలను కలుపుతూ ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపింది. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం భారత్‌-చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత తొమ్మిదేళ్లలో బీఆర్‌వో.. పలు కీలక ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేసింది. సరిహద్దుల్లో మరో ఏడు సొరంగ మార్గాలను నిర్మించనున్నట్లు రక్షణ శాఖ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణాత్మక వైఖరి నెలకొనడంతో సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా కేంద్రం ప్రభుత్వం రహదారుల నిర్మాణం, సైనిక బలగాల వసతి సౌకర్యాలు, హెలిపాడ్లను సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని