WhatsApp Web: వాట్సప్ వెబ్‌కీ తాళమేయండి
యాప్‌లోనే కాదు, వెబ్‌లోనూ భద్రతను పెంచటం మీద వాట్సప్ దృష్టి సారించింది. ఇందుకోసం కొత్త స్క్రీన్‌లాక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సప్ వెబ్ బీటా ప్రోగ్రామ్‌లో చేరినవారికిది అందుబాటులో ఉంటుంది.
యాప్‌లోనే కాదు, వెబ్‌లోనూ భద్రతను పెంచటం మీద వాట్సప్ దృష్టి సారించింది. ఇందుకోసం కొత్త స్క్రీన్‌లాక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సప్ వెబ్ బీటా ప్రోగ్రామ్‌లో చేరినవారికిది అందుబాటులో ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తేనే వాట్సప్ వెబ్ అన్‌లాక్ అవుతుంది. ఒకవేళ పాస్‌వర్డ్ మరచిపోయినట్టయితే వాట్సప్ వెబ్ నుంచి లాగవుట్ అయ్యి, తిరిగి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లాగిన్ అవ్వాలి. అంటే పాస్‌వర్డ్ లేకుండా వాట్సప్ ఛాట్స్, మెసేజ్‌లను చూడలేమన్నమాట. స్క్రీన్ లాక్ అయ్యినప్పుడు నోటిఫికేషన్లు సైతం కనిపించవు. మన సంభాషణల గోప్యతను కాపాడుకోవటానికిది తోడ్పడుతుంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతానికి తాజా వాట్సప్ వెబ్ బీటా వర్షన్ వాడే కొందరు యూజర్లకే అందుబాటులో ఉంది. త్వరలోనే మరింత మందికి విస్తరించనున్నారు. మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవటం కోసం వెబ్ బీటాలో మరో కొత్త ఫీచర్‌నూ ప్రవేశపెట్టారు. టెక్స్ట్ మెసేజ్ మెనూ ఆప్షన్లలో ‘ఎడిట్ మెసేజెస్’ ఫీచర్ కనిపిస్తుంది. అయితే మెసేజ్‌ను పంపించాక 15 నిమిషాల్లోపే ఎడిట్ చేసుకోవాలి. ఛాట్ ప్రామాణికతను కాపాడటమే దీని ఉద్దేశం. చాలాకాలం తర్వాత మెసేజ్‌ను పూర్తిగా మార్చటం కాకుండా టైపింగ్‌లో దొర్లిన తప్పులను సవరించటానికే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి