Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Aug 2023 09:16 IST

1. వైకాపాకు ఓటేస్తే మరణ శాసనమే

‘‘అందాల కోనసీమ అనగానే పాడిపంటలు గుర్తొస్తాయి. పూతరేకుల్లాంటి మంచి మనసున్న ప్రజానీకం.. మర్యాదకు మారుపేరు.. అలాంటి పచ్చని కోనసీమలో నేడు రాజకీయ చిచ్చుపెట్టారు.’’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమలాపురంలో శుక్రవారం రాత్రి భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా వాళ్లు చేసిందేమీ లేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మోగింది కల్యాణ వీణ

ఆషాఢం, అధిక శ్రావణ మాసాలతో ముహూర్తాలు లేక రెండు నెలలుగా వివాహాది శుభకార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి.  నిజశ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల .సందడి తిరిగి ఊపందుకోనుంది. శనివారం నుంచి డిసెంబరు 31 వరకు దాదాపు 50కిపైగా ముహూర్తాలు ఉండటంతో ఇక వివాహాలు ముమ్మరంగా సాగనున్నాయి. దీంతో కల్యాణ మండపాలకు గిరాకీ పెరిగింది. వాటితోపాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు కూడా ఊపందుకోనున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పన్ను చెల్లింపుదార్ల సగటు ఆదాయం రూ.13 లక్షలు

దేశంలో ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే వారి వార్షిక సగటు ఆదాయం   రూ.13 లక్షలకు చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. 2014 మదింపు సంవత్సరంలో ఒక్కో రిటర్నుదారు సగటు వార్షికాదాయం రూ.4.4 లక్షలుగా, 2023 నాటికి అది రూ.13 లక్షలకు చేరినట్లు వెల్లడించింది. 2025 నాటికి రూ.17.2 లక్షలకు, 2047 నాటికి రూ.49.7 లక్షలకు చేరనున్నట్లు అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పల్లె పోరుకు సై

పంచాయతీ ఉప ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి సారి పల్లెపోరులో తెరవెనుక పావులు కదిపే నాయకులు ఈ సారి బలమైన అభ్యర్థులను నిలబెట్టి వారికి ఆర్థిక దన్నుగా నిలబడ్డారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగేదాకా వచ్చారు. వైకాపా నాయకులు అక్కడితో ఆగకుండా ప్రజలను బెదిరించి..బుజ్జగించి..ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా తమవైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రజాప్రతినిధి... చిత్రం చెబుతోంది.. చిత్తం చూపమని

వెయ్యి పదాల్లో చెప్పాల్సిన విషయాన్ని ఒక్క చిత్రంతో చెప్పవచ్చు.. లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ చిత్రాలు ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నాయి. పనులు అర్ధంతరంగా ఆగిపోవడానికి కారణం ఎవరని అడుగుతున్నాయి. ప్రజాకాంక్షలు గుర్తించిన గత ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలు రూపొందించింది. సమస్యల పరిష్కారానికి రూ.కోట్లు  కేటాయించింది. పనులూ ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రైళ్ల రద్దు.. ‘ప్యాసింజరు’కు కష్టాలు

రెండు నెలలుగా ప్యాసింజరు రైళ్లు (ఇప్పుడు వీటిని ఎక్స్‌ప్రెస్‌లుగా పిలుస్తున్నారు) నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ పనులు,  ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్లేవారికి చౌక ప్రయాణ సాధనాలుగా ఇవి ఉండేవి. మూడోలైను పనులను కారణంగా చూపుతూ ఏడాది కాలంగా అనేక రైళ్లను రద్దు చేస్తూ వస్తున్నారు. ఈ ప్రకటనలు చివరి నిమిషంలో విడుదల చేస్తుండడంతో సమాచారం సైతం ప్రయాణికులకు తెలియడం లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సూర్యాపేట..ఖ్యాతి చాటేలా..!

సూర్యాపేట జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. జిల్లా పరిపాలన సౌధం అయిన కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో), వైద్య కళాశాల భవనం, సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు రేపు (ఆదివారం ఆగస్టు 20వ తేదీ) సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు భవనాల నిర్మాణానికి రూ.288.50 కోట్లు ఖర్చు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సర్దిచెబుతూ.. చక్కబెడుతూ..

 అభ్యర్థుల ప్రకటనకు ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే పనిని భారాస వేగవంతం చేసింది. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన దగ్గరపడుతుండటంతో ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్న.. అభ్యర్థులపై అసంతృప్తులు వ్యక్తమవుతున్న నియోజకవర్గాల్లో సమస్యలను సర్దుబాటు చేసే పనిలో పార్టీ నిమగ్నమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాక్‌ ప్రధాని ప్రత్యేక సలహాదారుగా.. ముశాల్‌ నియామకంపై భాజపా గరం

పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్‌ హఖ్‌ కాకర్‌కు ప్రత్యేక సలహాదారుగా ముశాల్‌ హుసేన్‌ మాలిక్‌ (38) నియామకంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం కల్పిస్తోందన్న తమ వాదనకు ఇది నిదర్శనమని భాజపా ప్రధాన కార్యదర్శి, జమ్మూకశ్మీర్‌ ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ శుక్రవారం విమర్శించారు. ముశాల్‌ ఉగ్రవాదులకు నిధుల సరఫరా కేసులో భారత్‌లోని తిహాడ్‌ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసీన్‌ మాలిక్‌ భార్య కావడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హృద్రోగ ముప్పును.. పుక్కిలింతతో పసిగట్టొచ్చు!

గుండె-రక్తనాళాల సంబంధిత వ్యాధుల(Cardiovascular diseases) ముప్పును కేవలం లాలాజల నమూనా పరీక్షతో ముందుగానే పసిగట్టగల సరికొత్త విధానాన్ని కెనడాలోని మౌంట్‌ రాయల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా చిగుళ్ల ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల పీరియడాంటైటిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. దాని బాధితుల్లో ఇన్‌ఫ్లమేటరీ కారకాలు చిగుళ్ల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి.. రక్తనాళ వ్యవస్థకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని