Mushaal Hussain Malik: పాక్‌ ప్రధాని ప్రత్యేక సలహాదారుగా.. ముశాల్‌ నియామకంపై భాజపా గరం

పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్‌ హఖ్‌ కాకర్‌కు ప్రత్యేక సలహాదారుగా ముశాల్‌ హుసేన్‌ మాలిక్‌ (38) నియామకంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది.

Updated : 19 Aug 2023 10:47 IST

ఆమె తిహాడ్‌ జైలులో ఉన్న యాసీన్‌ మాలిక్‌ భార్య

దిల్లీ, ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్‌ హఖ్‌ కాకర్‌కు ప్రత్యేక సలహాదారుగా ముశాల్‌ హుసేన్‌ మాలిక్‌ (38) నియామకంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం కల్పిస్తోందన్న తమ వాదనకు ఇది నిదర్శనమని భాజపా ప్రధాన కార్యదర్శి, జమ్మూకశ్మీర్‌ ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ శుక్రవారం విమర్శించారు. ముశాల్‌ ఉగ్రవాదులకు నిధుల సరఫరా కేసులో భారత్‌లోని తిహాడ్‌ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసీన్‌ మాలిక్‌ భార్య కావడం గమనార్హం. గురువారం రాత్రి జరిగిన పాక్‌ మంత్రివర్గ ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రకటించిన అయిదుగురు ప్రత్యేక సలహదారుల్లో ఈమె ఒకరు. పాకిస్థాన్‌ జాతీయురాలైన ముశాల్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా పొందారు. ఈమె ప్రధానికి మానవహక్కులు, మహిళా సాధికారత అంశాలపై సలహాలు ఇస్తారు. 2009లో రావల్పిండిలో యాసీన్‌ను ముశాల్‌ పెళ్లాడగా.. వీరికి ఓ కుమార్తె ఉంది. చాలాకాలంగా భారతదేశానికి, మన సైన్యానికి వ్యతిరేకంగా ముశాల్‌ కల్పిత గాధలను వ్యాప్తి చేస్తున్నట్లు తరుణ్‌ ఛుగ్‌ తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు ఈ విషయాన్ని గ్రహించి, పాక్‌ను నియంత్రించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు