Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Aug 2023 09:32 IST

1. విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌?

విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరింది. అయితే అటువంటి సమాచారం తమకు అందలేదని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు నడుస్తోంది. ఈ రైలులో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే రద్దు చేయాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలియకుండా బాదేస్తున్నారు..

వాడిన విద్యుత్తు కొంత... భారం కొండంత. వినియోగించినది కాకుండా మూడు అదనపు భారాలు. నెలవారీ విద్యుత్తు బిల్లులు చూసి జనం గగ్గోలు పెడుతున్నారు. ట్రూఅప్‌... ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటూ వ్యాపారులు.. గృహ వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 18.76 లక్షల మందిపై అదనపు ఛార్జీల భారం పడుతుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పోస్టు పెట్టినా.. కామెంట్‌ రాసినా జరభద్రం!

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. సమయం చిక్కితేచాలు.. నచ్చినట్టు పోస్టులు పెట్డడం.. ఆ పోస్టులతోపాటు నచ్చినవాటిని సైతం ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడం.. అందులో ఏం రాసుందో పరిశీలించకుండానే షేర్‌ చేస్తున్నారు. ఆడపిల్లల ఫొటోలు కనిపించగానే ఆకతాయిలు అసభ్యపదజాలంతో ఛాటింగ్‌ చేస్తున్నారు. వాటిలో ఏవైనా సున్నితమైన అంశం ఉన్నపుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు, కామెంట్స్‌ ఎవరూ గమనించరనే నమ్మకంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారాస అభ్యర్థులపై వీడనున్న ఉత్కంఠ

వచ్చే ఎన్నికల్లో భారాస తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించనున్నట్లు పార్టీ అధిష్ఠానం వెలిబుచ్చింది. దీంతో ఉభయ జిల్లాల్లో ఎవరికి టికెట్‌ లభించనుందనే చర్చ గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు నియోజకవర్గాల్లో అప్పుడే అసమ్మతి సెగలు మొదలయ్యాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జగన్‌ ‘వలలో’ గంగపుత్రుల విలవిల!

మరి ఆ హామీని నిలబెట్టుకున్నారా అంటే ‘ఒడ్డు దాటించే వరకు ఓడ మల్లన్న...ఒడ్డు దాటాక బోడు మల్లన్న’ అన్న చందంగా మత్స్యకారులను సీఎం జగన్‌ నిలువునా ముంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగపుత్రులకు ఇచ్చిన ప్యాకేజీ, ఉద్యోగ హామీని గంగలో కలిపేశారు. నాడు ఎన్నికల్ల్లో లబ్ధి కోసం నెత్తిపై తాటాకు టోపీ, వల చేతపట్టుకుని తనదైన శైలిలో నవ్వుతూ, ముద్దులు పెడుతూ పూడిమడక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతానని డాంబికాలు పలికారు జగన్‌.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎంటెక్‌ ప్రవేశాలు ఢమాల్‌

పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ఫీజుల చెల్లింపు పథకాన్ని నిలిపేస్తే ఏఐని సృష్టించే వాళ్లుగా విద్యార్థులు తయారవుతారా? మార్కెట్లోకి వస్తున్న ఎమర్జింగ్‌ కోర్సులపై ఉన్నత చదువుల్లేకుండానే ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా తయారు కాగలుగుతారా? రాష్ట్రంలో ఎంటెక్‌లో చేరే వారి సంఖ్య ఏటేటా దారుణంగా పడిపోతున్నా పట్టించుకోకుండా ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, ఎంఐటీ, కేంబ్రిడ్జి బోధన పద్ధతులు అమలు చేస్తామంటే ఏం లాభం? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రక్తనాళాల్లో సమస్యలను సమతుల ఆహారంతో అడ్డుకుందాం!

వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణాల్లో.. రక్తనాళాల్లో (సిరలు, ధమనులు) రక్తం గడ్డకట్టడం ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. ఈ ముప్పును తగ్గించడానికి ఎలాంటి ఆహారం దోహదపడుతుంది.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అంశాలన్నీ కీలకం. ఇందుకు సంబంధించి ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐజేఎంఆర్‌) అధ్యయనాంశాలను వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గృహలక్ష్మికి ని‘బంధనాలు’

రాష్ట్రంలో సొంత స్థలాలున్న నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తుండగా... మరోవైపు ప్రధాన నిబంధనలపై దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్‌కార్డు/ఆహారభద్రత కార్డు; ఆధార్‌, ఓటరు ఐడీ,  మహిళల పేరిటే స్థలం ఉండాలనే నిబంధనలు ఎంపికకు ప్రతిబంధకంగా మారాయని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం కొత్త రేషన్‌కార్డులకు దాదాపు పది లక్షల దరఖాస్తులు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 23న సాయంత్రం 6:04 గంటలకు.. చందమామపై దిగనున్న చంద్రయాన్‌-3

చందమామపై కాలుమోపే దిశగా భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ ల్యాండర్‌ మాడ్యూల్‌ చివరి డీబూస్టింగ్‌ ప్రక్రియ ఆదివారం విజయవంతమైంది. ప్రస్తుతం అది జాబిల్లి చుట్టూ ఉన్న 25×134 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపనున్నట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది. ఈ ప్రక్రియను తమ వెబ్‌సైట్‌ సహా బహుళ వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పరీక్షలు రెండు.. ప్రిపరేషన్‌ ఒకటే!

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష నవంబర్‌ రెండు, మూడు తేదీల్లో జరగనుంది. గ్రూప్‌-3 పరీక్ష ముందుగా అనుకొన్న షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలు లేవు. సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటివరకు గ్రూప్‌-3 పరీక్ష తేదీల గురించి సమాచారం ఇవ్వలేదు కానీ ఆగస్టు 21 వరకు అభ్యర్థులకు ఎడిట్‌ చేసుకునే అవకాశం ఇచ్చింది. గ్రూప్‌-3.. గ్రూప్‌-2 పరీక్షకు ముందా..తరువాత అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సిలబస్‌ దాదాపు ఒకే రకంగా ఉన్నందున రెండు పరీక్షలకూ ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో చదివి మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని