Vande Bharat Express: విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌?

విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

Updated : 21 Aug 2023 10:16 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరింది. అయితే అటువంటి సమాచారం తమకు అందలేదని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు నడుస్తోంది. ఈ రైలులో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే రద్దు చేయాల్సి వస్తోంది. తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రేక్‌ను చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మరో పక్క దీన్ని విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని