ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎందరంటే..

తెలంగాణలో ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైంది. ఈ నెలాఖరు వరకు ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌

Updated : 01 Nov 2021 18:21 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ముసాయిదాలు విడుదలయ్యాయి. ఈ నెలాఖరు వరకు ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ వెల్లడించారు. పలు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చించారు. అనంతరం ముసాయిదాను ప్రకటించారు. రాష్ట్రంలో 3,03,56,665 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ప్రకారం 1,52,57,690 మంది పురుష ఓటర్లు కాగా..  1,50,97,292మంది ఉన్నారు.  1683మంది ఇతరులు ఉండగా.. సర్వీసు ఓటర్లు 14,501 మంది, 2742 మంది ఎన్నారై ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. ఇందులో దివ్యాంగులు 5,01,836మంది ఉన్నట్టు పేర్కొన్నారు. 2022 జనవరి 5న తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఈ నెల 6న ముసాయిదా ప్రకటిస్తామన్న శశాంక్‌ గోయల్‌.. డిసెంబర్‌ 6వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల సంఘానికి తాము పలు సూచనలు, సలహాలు ఇచ్చామని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి వెల్లడించారు.

ఏపీలో ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకారం.. 

ఏపీలో బద్వేలు నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4 కోట్ల 4లక్షల మంది ఉండగా.. వీరిలో పురుష ఓటర్లు కోటి 99లక్షల మంది, మహిళా ఓటర్లు 2 కోట్ల 4లక్షల మంది ఉన్నారు. 67వేల మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,678 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 43 లక్షల 31వేల మంది ఓటర్లు ఉండగా.. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18లక్షల 94వేల మంది ఓటర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని