పరస్పరం చేరువగా శుక్రుడు, అంగారకుడు, చందమామ!

భూమికి పొరుగునున్న శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న కనువిందు చేయనున్నాయి. ఆకాశంలో ఇవి పరస్పరం చాలా దగ్గరగా కనిపించనున్నాయి. 12న ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా

Updated : 09 Jul 2021 07:09 IST

12-13 తేదీల్లో ఖగోళ అద్భుతం

దిల్లీ: భూమికి పొరుగునున్న శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న కనువిందు చేయనున్నాయి. ఆకాశంలో ఇవి పరస్పరం చాలా దగ్గరగా కనిపించనున్నాయి. 12న ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా దర్శనమిస్తుంది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండానే కంటితో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించొచ్చు. ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా అరుదైన సందర్భాల్లో అవి భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు అంగారకుడు, శుక్రుడు మధ్య ఎడం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుంది. ఈ రెండు గ్రహాలు, చందమామ.. పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం నుంచే కనపడుతోంది. 13న మరింత దగ్గరగా  కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని