71,559 రికవరీలు.. 66,732 కేసులు

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి చేరింది. గత 24 గంటల్లో 9,94,851 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 66,732 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల్లో 8,61,853 మందికి చికిత్స కొనసాగుతుండగా.......

Published : 12 Oct 2020 10:28 IST

దిల్లీ: దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి చేరింది. గత 24 గంటల్లో 9,94,851 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 66,732 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల్లో 8,61,853 మందికి చికిత్స కొనసాగుతుండగా.. 61,49,536 కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 816 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,09,150కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 71,559 మంది బాధితులు కోలుకోవడం విశేషం. గత కొన్ని రోజులుగా కొత్తగా వైరస్‌ బారిన పడుతున్న వారి కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే అధికంగా ఉండడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.36 శాతంగా.. మరణాల రేటు 1.53 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,78,72,093 నమూనాల్ని పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని