Pakistan: లాహోర్‌లో సిలిండర్ల పేలుళ్లు

భారీ సంఖ్యలో గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన బర్కత్ మార్కెట్‌ దద్దరిల్లింది. ఈ ఘటనలో పెద్దసంఖ్యలో దుకాణాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది.

Updated : 29 Jun 2021 19:07 IST

దద్దరిల్లిన బర్కత్ మార్కెట్‌

ఇస్లామాబాద్‌: భారీ సంఖ్యలో గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన బర్కత్ మార్కెట్‌ దద్దరిల్లింది. ఈ ఘటనలో పెద్దసంఖ్యలో దుకాణాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ పేలుళ్లు జరిగినట్లు  తెలుస్తోంది. 

అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం, క్షతగాత్రులు గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు పది సిలిండర్లు పేలినట్లు, ఒకరు గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి. పదుల సంఖ్యలో దుకాణాలు, వాహనాలు ధ్వంసమైనట్లు వెల్లడించాయి. అధికారులు ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బర్కత్ మార్కెట్‌లోని గ్యాస్ సిలిండర్లు ఉంచిన సెక్షన్లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి పేలుతుండటంతో సహాయక చర్యలు చేపట్టడం క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని