ఈ దేశం గురించి ఆయనకు ఏం తెలుసు?:రౌత్‌

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో వెలువరించిన అభిప్రాయాన్ని శనివారం శివసేన పార్టీ తప్పుపట్టింది.

Published : 14 Nov 2020 19:01 IST

ముంబయి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో వెలువరించిన అభిప్రాయాన్ని శనివారం శివసేన పార్టీ తప్పుపట్టింది. పని పూర్తి చేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని విద్యార్థి ఎలా ఆరాటపడతారో అలాంటిదే తప్పిస్తే ప్రావీణ్యం సంపాదించాలనే తపన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలో లేదని ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్’ పేరుతో రాసిన పుస్తకంలో ఒబామా అభిప్రాయడ్డారు. కాగా, దీనిపై సేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ‘ఒక విదేశీ నేత భారత రాజకీయ నేతలపై అలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు. అది చాలా అసహ్యకరంగా ఉంది. ‘ట్రంప్ పిచ్చివాడు’ అని మేం అనలేం. ఈ దేశం గురించి ఒబామాకు ఏమాత్రం తెలుసు?’ అంటూ విమర్శించారు.

కాగా, ఈ నెల 17న మార్కెట్లోకి విడుదల కానున్న ఈ పుస్తకంలో ఒబామా తన బాల్యం, రాజకీయ ప్రస్థానంతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా ప్రస్తావించారు. ‘ది న్యూయార్క్‌ టైమ్స్’ ఈ పుస్తకాన్ని సమీక్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని