Mukesh Ambani: వాడియా హత్య కేసు.. సాక్షిగా అంబానీని పిలవడం కుదరదు: సీబీఐ ప్రత్యేక కోర్టు

వ్యాపారవేత్త నుస్లి వాడియా హత్య కేసులో రిలయన్స్‌ పరిశ్రమల అధినేత ముకేశ్‌ అంబానీని సాక్షిగా పిలిపించాలన్న పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.

Updated : 17 Jan 2023 08:12 IST

ముంబయి: వ్యాపారవేత్త నుస్లి వాడియా హత్య కేసులో రిలయన్స్‌ పరిశ్రమల అధినేత ముకేశ్‌ అంబానీని సాక్షిగా పిలిపించాలన్న పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. నిందితుల్లో ఒకరైన ఇవాన్‌ సెకెఇరా ఈ పిటిషన్‌ను వేశారు. విచారణకు సాక్షిగా ఎవరిని పిలిపించాలో చెప్పే హక్కు నిందితుడికి లేనందున కోర్టు దాన్ని తిరస్కరించిందని సీబీఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. 1989లో వాడియా అనే వ్యాపారవేత్తను చంపిన కేసులో కీర్తి అంబానీతో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. ఈ కేసును 1989లోనే మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు