నీతీశ్‌ సర్కార్ కీలక నిర్ణయం.. జ్యుడీషియల్‌ సర్వీసుల్లో 10% ఈడబ్ల్యూఎస్‌ కోటా!

ఆర్థికపరంగా బలహీనవర్గాలకు బిహార్‌లోని నీతీశ్ కుమార్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జ్యుడీషియల్‌ సర్వీసెస్‌, లా కాలేజీల్లో 10శాతం EWS రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది.

Published : 03 Oct 2023 17:03 IST

పట్నా:  బిహార్‌లోని నీతీశ్‌ కుమార్‌ సారథ్యంలోని మహాకూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా బలహీనవర్గాలకు (EWS)కు చెందిన వారికి న్యాయ సర్వీసులు, ప్రభుత్వ న్యాయ కళాశాలలు, యూనివర్సిటీల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నీతీశ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌-1951 మార్గదర్శకాల్లో సవరణలకు మంత్రివర్గం ఆమోదించిందని.. జ్యుడీషియల్‌ సర్వీసులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యాయ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్‌. సిద్ధార్థ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే సంబంధత శాఖ నుంచి జారీ అవుతుందన్నారు. 

బిహార్‌లో 63 శాతం బీసీలే

అలాగే, రాష్ట్రంలో 100 వెటర్నరీ ఆస్పత్రిల నిర్మాణానికి సైతం నీతీశ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. బిహార్‌లో పలు జిల్లాల్లో 100 ప్రథమ శ్రేణి వెటర్నరీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు.. ఆయా ఆస్పత్రుల్లో శిక్షణా సంస్థల్ని సైతం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 17 జిల్లాల్లో వెటర్నరీ ఆస్పత్రుల నిర్మాణం కోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనునున్నట్టు  వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని