LS Polls: భారత్‌లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీలకు భాజపా ఆహ్వానం

భారత్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార తీరును చూసేందుకు 25 దేశాలకు చెందిన రాజకీయ పార్టీలను భాజపా ఆహ్వానించింది. త్వరలో ఆయా పార్టీల ప్రతినిధులు దేశానికి రానున్నట్లు తెలుస్తోంది. 

Updated : 10 Apr 2024 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచార తీరును చూసేందుకు విదేశాలకు చెందిన రాజకీయ పార్టీలు త్వరలో భారత్‌కు రానున్నాయి. 25 దేశాలకు చెందిన ఆయా పార్టీలను కేంద్రంలోని భాజపా ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు పార్టీల ప్రతినిధులు త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా హ్యాట్రిక్‌ కొట్టాలని ఆ పార్టీలు ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల స్థాయి, అధికార పార్టీ వ్యూహాలు వంటి అంశాలను అంచనా వేసుకోనున్నాయి. 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించగా.. వీటిలో ఇప్పటివరకు 13 ఆహ్వానాన్ని అంగీకరించాయి. జర్మనీ, బ్రిటన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లోని పార్టీ ప్రతినిధులు రానున్నారు.

భవిష్యత్తును చూడాలంటే భారత్‌కు రండి: అమెరికా రాయబారికేజ్రీవాల్‌

అమెరికాను ఆహ్వానించని భాజపా..

ఇదే ఏడాది అమెరికాలోనూ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పార్టీలను ఆహ్వానించలేదని సమాచారం. బ్రిటన్‌లోని కన్జర్వేటివ్‌ పార్టీ, లేబర్‌ పార్టీలతో పాటు జర్మనీకి చెందిన క్రిస్టియన్‌ డెమోక్రాట్లు, సోషల్‌ డెమోక్రాట్‌లను భాజపా ఆహ్వానించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసే ప్రచారాల్లో ప్రతినిధులు పాల్గోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఏప్రిల్‌ 19 మొదలు జూన్‌ 1 వరకు మొత్తం 44 రోజులపాటు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్‌ నిర్వహించనుంది. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు.. 370 స్థానాలను గెలుచుకునే దిశగా కాషాయ పార్టీ గట్టి కసరత్తు చేస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని