Congress: కాంగ్రెస్‌ రెండో జాబితా.. బరిలో మాజీ సీఎంల తనయులు

Congress second list: కాంగ్రెస్‌ పార్టీ మరో జాబితాను ప్రకటించింది. 43 మంది పేర్లను ఖరారు చేసింది. వీరిలో ముగ్గురు మాజీ సీఎంల తనయులు ఉన్నారు.

Published : 12 Mar 2024 19:05 IST

Congress second list | దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ (Congress) మరో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. తాజాగా మరో 43 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అసోం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, దమన్‌దీవ్‌ పరిధిలోని పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ జాబితాలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారుల పేర్లు ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ ఛింద్వాడా నుంచి పోటీ చేయనున్నారు. రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ను జాలోర్‌ నుంచి ఆ పార్టీ బరిలోకి దింపింది. అసోం మాజీ సీఎం తరుణ్‌ గగోయ్‌ తనయుడు జోర్హాట్‌ నుంచి పోటీ చేయనున్నారు. గతంలో కలియాబోర్‌ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. 43 మందిలో జనరల్‌ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా.. 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని