AI Express: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

దుబాయ్‌- అమృత్‌సర్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం పాకిస్థాన్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.

Published : 15 Oct 2023 20:27 IST

దిల్లీ: దుబాయ్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకోవాల్సిన ఓ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానం అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని కరాచీ (Karachi)లో ల్యాండ్‌ అయ్యింది. విమానంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడమే దీనికి కారణమని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు. శనివారమే ఈ ఘటన చోటుచేసుకోగా నేడు వెలుగులోకి వచ్చింది.

‘దుబాయ్- అమృత్‌సర్ విమానంలోని ఓ ప్రయాణికుడికి మార్గమధ్యలో అకస్మాత్తుగా వైద్యపరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో వీలైనంత త్వరగా అతడికి వైద్య సాయం అందించేందుకుగానూ కరాచీ అత్యంత సమీపంలో ఉండటంతో విమానాన్ని అక్కడికి మళ్లించారు.  ల్యాండింగ్ అయిన వెంటనే సంబంధిత వ్యక్తికి వైద్య సేవలు అందించారు. అనంతరం విమానాశ్రయ వైద్య సిబ్బంది అతడికి ప్రయాణించడానికి అనుమతినిచ్చింది. దీంతో విమానం కరాచీ నుంచి అమృత్‌సర్‌కు చేరుకుంది’ అని విమానయాన ప్రతినిధులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని