ఈ ‘సూపర్‌ అనకొండ’ రైలు చూశారా?

భారత రైల్వే శాఖ చరిత్ర సృష్టించింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా.. మూడు గూడ్స్‌ రైళ్లు జతకలిపి..

Published : 01 Jul 2020 01:22 IST

చరిత్ర సృష్టించిన భారత రైల్వే శాఖ

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్‌ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్‌పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్‌ రైళ్లను జతచేసి నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దీనిపై రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్‌పుర్‌-చక్రధర్‌పూర్‌ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు వెల్లడించింది. 15 వేల టన్నులకు పైగా సరకుతో ఉన్న మూడు రైళ్లను అనకొండను పోలినట్టుగా నడిపించినట్లు తెలిపింది. గూడ్స్‌ రైలు సర్వీసుల రవాణా సమయాన్ని తగ్గించేందుకే ఈ వినూత్న ప్రయోగం చేపట్టినట్లు పేర్కొంది.  

ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలో ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర సామగ్రిని తరలించడంపై రైల్వే శాఖ దృష్టి పెట్టిందన్నారు. శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపారు. రైల్వేశాఖ దేశంలో ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్‌ రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నాయని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని